ర‌కుల్ క‌లల‌కు బ్రేకేసిన దీపిక‌..

అవునా.. వీళ్లిద్ద‌రికి ఏంటి సంబంధం..? అస‌లు దీపిక ప‌దుకొనేతో ర‌కుల్ ఎందుకు పెట్టుకుంది..? ఏ విష‌యంలో ఈమె క‌ల‌ను దీపిక చెడ‌గొట్టింది అనుకుంటున్నారా..? ఏం చేస్తాం.. ఒక్కోసారి అంతే.. ఒక‌రి కోసం మ‌రొక‌రు త్యాగం చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. అస‌లు విష‌యం ఏంటంటే ర‌కుల్ న‌టించిన రీ ఎంట్రీ బాలీవుడ్ సినిమా అయ్యారీ ఇప్పుడు వాయిదా ప‌డింది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 26న విడుద‌ల కావాల్సింది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ కూడా బిజీబిజీగా చేసుకుంటున్నారు. ఇంత‌లో స‌డ‌న్ గా రేస్ లోకి వ‌చ్చింది ప‌ద్మావ‌త్. ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

ర‌న్ వీర్ సింగ్, దీపిక, షాహిద్ క‌పూర్ లాంటి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో ఉండ‌టంతో ప‌ద్మావ‌త్ తో పోటీ ప‌డ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని ఫీల‌వుతున్నారు అయ్యారీ టీం. దానికితోడు జ‌న‌వ‌రి 26నే ప్యాడ్ మ్యాన్ కూడా విడుదల కానుంది. అస‌లే ఇప్పుడు అక్ష‌య్ కుమార్ సినిమాల‌కు ఎక్క‌డ లేని డిమాండ్ ఉంది. ఆయ‌న‌తో పోటీ ప‌డితే లేనిపోని త‌ల‌నొప్పులు త‌ప్ప‌వు. అందుకే ఈ రెండు సినిమాల వేడి త‌గ్గిన త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 9న అయ్యారీ విడుద‌ల కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ర‌కుల్ రీ ఎంట్రీ సినిమా ఊహించ‌ని విధంగా పోస్ట్ పోన్ అయింది.