ర‌కుల్ ఏంటి అలా చేస్తుంది..?

Last Updated on by

తెలుగు ఇండ‌స్ట్రీని కాద‌ని బాలీవుడ్ కు వెళ్లింది ర‌కుల్. అక్క‌డ షాక్ త‌గిలింది. ఈమె న‌టించిన అయ్యారీ అడ్రస్ లేకుండా పోయింది. దాంతో మ‌ళ్లీ బుద్దిగా సౌత్ ఎక్స్ ప్రెస్ ఎక్కేసింది. కానీ వ‌స్తూ వ‌స్తూ తెలుగు ఇండ‌స్ట్రీని మ‌రిచిపోయింది. ఇప్పుడు అమ్మాయిగారు చూపుల‌న్నీ త‌మిళ ఇండ‌స్ట్రీ వైపు వెళ్తున్నాయి. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇప్పుడు తెలుగులో పూజాహెగ్డే, కైరా లాంటి కొత్త వాళ్ల హ‌వా న‌డుస్తుంది. పైగా ర‌కుల్ ప్రీత్ ఇప్ప‌టికే తెలుగులో అంద‌రు టాప్ హీరోల‌తోనూ న‌టించింది. దాంతో ఇప్పుడు ఎవ‌రూ ఆఫ‌ర్లు ఇచ్చే మూడ్ లో కూడా లేరు. కానీ త‌మిళ్ లో అలా కాదు. ఇప్ప‌టికీ ఆమె అక్క‌డ చాలా మంది హీరోల‌తో న‌టించ‌లేదు. దాంతో ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీపై ఫోక‌స్ పెడుతుంది ర‌కుల్. ప్ర‌స్తుతం అక్క‌డ అదృష్టం బాగుండి వ‌ర‌స అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. రెండేళ్లు తెలుగు ఇండ‌స్ట్రీని మ‌కుటం లేని మ‌హారాణిలా ఏలేసింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఇక్క‌డ స్టార్ హీరోలంతా అమ్మ‌డు లెట్స్ డూ కుమ్ముడు అంటూ ఆడి పాడేసారు. సందీప్ కిష‌న్ నుంచి మొద‌లుపెట్టి మ‌హేష్ బాబు వ‌ర‌కు అంద‌రితోనూ రొమాన్స్ చేసింది ర‌కుల్. ఇప్పుడు ఇక తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక్క ప‌వ‌న్.. ప్ర‌భాస్ త‌ప్ప ఎవ‌రూ మిగ‌ల్లేదు. ఇప్ప‌ట్లో వాళ్లు ఛాన్స్ ఇచ్చేలా లేరు. అందుకే అమ్మ‌డి చూపులు త‌మిళ ఇండ‌స్ట్రీ వైపు మ‌ళ్లాయి.Rakul Preet Singh Focus on Tamil Industry After Aiyaary Flopగ‌తేడాది తెలుగులో జ‌య జాన‌కీ నాయ‌కా.. రారండోయ్ వేడుక చూద్దాం.. స్పైడ‌ర్ లాంటి సినిమాల్లో మంచి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది ర‌కుల్. ఈ సినిమాల‌న్నీ పూర్తైన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో మ‌రో సినిమా ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ‌. కార‌ణం తెలియ‌దు కానీ ఇప్పుడు ర‌కుల్ దృష్టి మొత్తం కోలీవుడ్ పైనే ఉంది. ఈ మ‌ధ్యే కార్తితో న‌టించిన తీరాన్ అధిగారం ఒండ్రు కూడా హిట్టైంది. తెలుగులో ఖాకీగా వ‌చ్చింది ఈ చిత్రం. ఇక ఇప్పుడు సూర్య హీరోగా సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కిస్తోన్న ఎన్ జి కే సినిమాలోనూ హీరోయిన్ గా న‌టిస్తుంది ర‌కుల్. ఇందులో సాయిప‌ల్ల‌వి మ‌రో హీరోయిన్. త‌మిళ్ లోనే మ‌రో రెండు సినిమాల్లోనూ న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికే శివ‌కార్తికేయన్ సినిమాకు ఓకే చెప్పింది. దాంతో పాటు కార్తితో మ‌రో సినిమాకు ఈ మ‌ధ్యే సైన్ చేసింది. ఈ సినిమా ముహూర్తం కూడా చెన్నైలో జ‌రిగింది ఈ మ‌ధ్యే. త‌మిళ్ లో న‌టిస్తూనే బాలీవుడ్ లోనూ అవ‌కాశాల కోసం చూస్తుంది ఈ భామ‌. ఎటు చూసుకున్నా ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి ర‌కుల్ కు బంధాలు తెగిపోయిన‌ట్లే క‌నిపిస్తున్నాయి. ఇప్పుడంతా అమ్మాయిగారి చూపులు ఐతే త‌మిళ్.. లేదంటే బాలీవుడ్ పై ఉన్నాయి.

User Comments