Last Updated on by
ఎంతవారికైనా ఇండస్ట్రీలో ఎక్స్ పైరీ ఉంటుంది. హీరోయిన్లకు అది ఇంకా కాస్త త్వరగానే వస్తుంది. హీరోల మాదిరి వాళ్లు ఏళ్లకేళ్ళు ఉండలేరు. ఓ కొత్త హీరోయిన్ వచ్చిందంటే చాలు.. పాత సరుకు పోవాల్సిందే. ఏడాది కింది వరకు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడుతుంది. స్పైడర్ తర్వాత తెలుగులో మరే సినిమా చేయలేదు రకుల్. తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తెలుగుకు పూర్తిగా దూరం అయిపోయింది రకుల్ ప్రీత్.
ఇక ఇప్పుడు మెగా హీరో సినిమాలో ఐటం గాళ్ గా మారడానికి సై అనేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి శీను-రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రకుల్ ఐటం సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. రకుల్ అంటే బోయపాటికి కూడా సెంటిమెంటే. సరైనోడుతో పాటు జయ జానకి నాయకాలో కూడా రకుల్ నే హీరోయిన్ గా తీసుకున్నాడు ఈ దర్శకుడు. ఇక చరణ్ తో కూడా బ్రూస్లీ.. ధృవ సినిమాల్లో నటించింది. ఈ ఇద్దరితో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఇప్పుడు ఐటం సాంగ్ చేయబోతుందని తెలుస్తుంది. మొత్తానికి ఈ ఐటం సాంగ్ మనీ కోసమా.. లేదంటే అవకాశం కోసమా.. అదీకాదంటే ఉనికి చాటుకోవడం కోసమా అనేది రకుల్ కే తెలియాలిక..!
User Comments