ర‌కుల్ గ్రేట్ ప్లేయ‌ర్‌

Last Updated on by

పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్‌సింగ్ మూడు ముక్క‌లాట ఆడుతోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇక్క‌డో ఆట‌, అక్క‌డో ఆట‌, ఉత్త‌రాదిన ఇంకో ర‌కం ఆట ఆడుతోంది. ర‌కుల్ ఎక్క‌డ ఆడినా అది కోట్లాది రూపాయ‌ల డీల్‌కి తెర‌తీస్తోంది.

తెలుగు, త‌మిళం, హిందీలో ర‌కుల్ ప‌లు క్రేజీ అవ‌కాశాలు అందుకుంటోంది. ర‌కుల్ ప్ర‌స్తుతం బాల‌కృష్ణ న‌టిస్తున్న `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. అంజ‌లీదేవి, సావిత్రి నుంచి జ‌య‌సుధ‌, జ‌యప్ర‌ద వ‌ర‌కూ ఎంద‌రో మేటి క‌థానాయిక‌లు ఎన్టీఆర్‌తో నటించారు. అందులో ఓ క‌థానాయిక పాత్ర‌లో ర‌కుల్ న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అలానే బాలీవుడ్‌లో ఈ భామ అజ‌య్‌దేవ‌గ‌న్ స‌ర‌స‌న ఓ రొమాంటిక్ కామెడీలో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్‌లో ర‌కుల్ బిజీబిజీగా ఉంది. మ‌రోవైపు ర‌కుల్ న‌టించిన ల‌క్స్ ప్ర‌క‌ట‌న బుల్లితెర‌పై అల‌రించ‌నుంది. అలానే త‌న ఫ్రెండ్ బెల్లంకొండ సాక్ష్య ం సినిమాని సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌మోట్ చేస్తూ ర‌కుల్ చాలా దూకుడుగా ఉంది. సినిమాల‌తో పాటు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ భారీ ఆదాయం ఆర్జిస్తోంది. అలానే జిమ్ బిజినెస్‌లోనూ ఈ అమ్మ‌డి ఆర్జ‌న ఓ రేంజులో ఉంద‌ని తెలుస్తోంది.

User Comments