పూరీకి ర‌కుల్ రాయ‌బారం..

అవును.. పూరీ ద‌గ్గ‌రికి నిజంగానే ర‌కుల్ రాయ‌బారం చేసింది. ఈ ఇద్ద‌రూ ఎప్పుడు క‌లిసి ప‌నిచేసారు అనుకుంటున్నారా..? ఈ ఇద్ద‌రి బంధం నేటిది కాదు.. అప్పుడెప్పుడో ర‌కుల్ హీరోయిన్ కాక‌ముందే ఈమెకు తొలి అవ‌కాశం ఇచ్చాడు పూరీ. కానీ అనుకోని కార‌ణాల‌తో ఆ సినిమా వ‌దిలేసుకుంది ర‌కుల్. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేయ‌లేదు పూరీ. ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడు త‌న కొడుకు సినిమా మెహ‌బూబాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ లోనే జ‌రిగింది. ఆ మ‌ధ్య పంజాబ్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసాడు పూరీ. ఇప్పుడు కొత్త షెడ్యూల్స్ కోసం మ‌ధ్య ప్ర‌దేశ్, ల‌డ‌క్ వెళ్ల‌నున్నాడు.

ఈ సినిమాలో నేహా శెట్టి అనే కొత్త‌మ్మాయి న‌టిస్తుంది. సినిమాకో కొత్త భామ‌ను ప‌ట్టుకురావ‌డం పూరీకి కామ‌న్. అయితే ఈ సారి హీరోయిన్ వెన‌క మాత్రం చిన్న క‌థ ఉంది. నేహా సీన్ లోకి రావ‌డానికి కార‌ణం ర‌కుల్ ప్రీత్ సింగ్ అని తెలుస్తోంది. ఇక్క‌డే చిన్న ట్విస్ట్ కూడా ఉంది. నేహా శెట్టి బాయ్ ఫ్రెండ్ అమన్. ఇంత‌కీ ఈ అమ‌న్ ఎవ‌రో తెలుసా.. ర‌కుల్ ప్రీత్ కు స్వ‌యానా త‌మ్ముడు. నేహా, అమన్ చాలా క్లోజ్ గా ఉంటారు. అందుకే పూరీ ని రికమెండ్ చెయ్యమని అమన్ నుంచి ర‌కుల్ ను నేహ కోరడం.. వెంటనే రకుల్ ఆమెని ఆడిషన్ కి రమ్మని అడగడం.. అక్క చెవిలో అమన్ ఓ మాట వేయడం.. ఆ త‌ర్వాత పూరీ సీన్ లోకి రావ‌డం.. అన్నీ చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. పైగా ఈ భామ కూడా చూడ్డానికి బాగుంటుంది. దాంతో ఆకాశ్ కు అమ‌న్ గాళ్ ఫ్రెండ్ ను అలా సెట్ చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. మొత్తానికి త‌మ్ముడి కోసం పెద్ద ప‌నే చేసింది ర‌కుల్.