ర‌కుల్ సెక్సీ ఫిట్ నెస్ మంత్ర‌

Last Updated on by

అబ్బ‌బ్బా.. చూస్తుంటేనే అబ్బో అనిపిస్తుంది క‌దా ర‌కుల్ ప్రీత్ అందాలు. ఆ అందాల చాటున ఉన్న ఫిట్ నెస్. తెలుగు ఇండ‌స్ట్రీలో ఫిట్ నెస్ మీద ఎక్కువ‌గా దృష్టి పెట్టే హీరోయిన్స్ లో ర‌కుల్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. ఎప్పుడూ జిమ్ లోనే చెమ‌ట‌లు క‌క్కుతూ ఉంటుంది ఈ భామ‌. త‌న డ‌బ్బు కూడా జిమ్ బిజినెస్ లోనే పెట్టేసిందంటే ర‌కుల్ కు ఫిట్ నెస్ పై ఎంత పిచ్చి ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు కూడా ఇలాగే మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌.
Rakul preet singh
తాజాగా ర‌కుల్ ఫోటో ఒక‌టి విడుద‌లైంది. అందులో అమ్మాయిగారి ఫిట్ నెస్ లెవ‌ల్స్ చూసి వామ్మో అనిపించ‌క మాన‌దు. అదిరిపోయే ఫిట్ నెస్ కు తోడు అందాల‌ను కూడా అలాగే ఆర‌బోసింది ఈ భామ‌. ఎక్క‌డికక్క‌డ ర‌కుల్ చూపించిన తీరు కేకే అస‌లు. ప్ర‌స్తుతం బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ పై ఫోక‌స్ పెట్టింది ర‌కుల్. తెలుగులో ఈ భామ ఇప్పుడు ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు. నాగ‌చైత‌న్య సినిమా అనుకుంటున్నా అందులో ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. మొత్తానికి ర‌కుల్ సెక్సీ ఫిట్ నెస్ మంత్రాతో అన్ని ఇండ‌స్ట్రీల‌ను అయితే ప్ర‌స్తుతానికి క‌వ‌ర్ చేస్తుంది.

User Comments