లండ‌న్ లోనే ర‌కుల్ మకాం..!

Last Updated on by

కాళ్ల కింద చ‌క్రాల‌తో పుట్టిందా ఏంటి అనేంత‌గా ఒక్క చోట ఉండ‌కుండా అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది ర‌కుల్. ఓ రోజు చెన్నైలో ఉంటే.. మ‌రోరోజు హైద‌రాబాద్ లో తేలుతుంది. అరె ఇక్క‌డుందా అనుకునేలోపు ముంబై వెళ్లిపోతుంది. ఇవ‌న్నీ కాదంటే హాయిగా హాలీడేస్ అంటూ విదేశాల‌కు చెక్కేస్తుంది. ఇంత బిజీగా ఉండే ర‌కుల్ ను ఒకేచోట క‌ట్టేయ‌డం అంటే మాట‌లు కాదు. కానీ ఇప్పుడు ఇదే జ‌రిగింది. ఈమె ఓ హిందీ సినిమా కోసం లండ‌న్ వెళ్లింది. రాబోయే నెల రోజులు అక్క‌డే ఉండ‌బోతుంది.

అజ‌య్ దేవ్ గ‌న్ హీరోగా డైరెక్టర్ ల‌వ్ రంజ‌న్ తెర‌కెక్కించ‌బోయే రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ లో హీరోయిన్ గా న‌టిస్తుంది ర‌కుల్. ఈ చిత్రం కోసం లండ‌న్ లోనే నెల రోజుల షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. అందుకే ఎక్క‌డా క‌ద‌ల‌కుండా అక్క‌డే ఉండాలంటూ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది ర‌కుల్. నో ఫ్లైట్స్.. నో ప్లేసెస్ అంటూ ట్వీట్ చేసింది ర‌కుల్. ఈ చిత్రంతో పాటు త‌మిళ్ లో శివ‌కార్తికేయ‌న్.. సూర్య‌.. కార్తి సినిమాల్లో న‌టిస్తుంది ర‌కుల్. లండ‌న్ నుంచి వ‌చ్చే వ‌ర‌కు ఈ సినిమాల‌న్నింటికీ ర‌కుల్ బ్రేక్ ఇచ్చిన‌ట్లే..!

User Comments