ర‌కుల్.. తాప్సీ అక్క‌డేం చేస్తున్నారు..?

Last Updated on by

ర‌కుల్.. తాప్సీ.. ఇద్ద‌రి గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఎందుకంటే ఇద్ద‌రూ తెలుగు సినిమాల‌తోనే స్టార్స్ అయ్యారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ఒకేసారి తెలుగు ఇండ‌స్ట్రీకి హ్యాండ్ ఇచ్చారు. కార‌ణం బాలీవుడ్.. అక్క‌డ్నుంచి పిలుపు రాగానే ఎగేసుకుని వెళ్లిపోయారు. దారి చూపించిన తెలుగు ఇండ‌స్ట్రీకి కాస్తైనా కృత‌జ్ఞ‌త చూపించ‌కుండా వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు ముంబైలో అవ‌కాశాల కోసం చూస్తున్నారు ఈ భామ‌లు. అయితే ఈ మ‌ధ్యే ఇద్ద‌రూ క‌లిసి ఓ పబ్ లో పార్టీ చేసుకున్నారు.

అక్క‌డే ఉన్న ఓ ఫోటోగ్రాఫ‌ర్ వీళ్ల పోజులు కెమెరాలో బంధించాడు. ఇందులో ర‌కుల్ కాస్త ప‌ద్ద‌తిగా ఉంది కానీ తాప్సీ అయితే అందాల‌న్నీ ఆర‌బోసేసింది. సింపుల్ గా చిన్న బ‌ట్ట‌లు వేసుకుని అన్నీ కెమెరా ముందు ప‌రిచేసింది. ముంబైలోని జుహూలో కోపా అనే ప‌బ్ లో వీళ్లు పార్టీ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ర‌కుల్ కు బాలీవుడ్ లో అజ‌య్ దేవ్ గ‌న్ సినిమా ఉంది. ఇక తాప్సీ కూడా చిన్న చిత‌కా సినిమాల‌తో నెట్టుకొస్తుంది. మ‌రి.. ఈ ఇద్ద‌రూ మ‌ళ్లీ తెలుగు ఇండ‌స్ట్రీవైపు క‌నీసం చూస్తారో లేదో..?

User Comments