త‌మిళ్ కు ర‌కుల్.. జ‌ర భ‌ద్రం.. 

ర‌కుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం చూస్తే ఈ  భామే నెం.1 హీరోయిన్. చాలా త్వ‌ర‌గా ఈ స్టేజ్ కు వ‌చ్చేసింది ర‌కుల్. 2016లో నాన్న‌కు ప్రేమ‌తో.. స‌రైనోడు.. ధృవ సినిమాల‌తో హ్యాట్రిక్ పూర్తి చేసింది ర‌కుల్. ఈ ఏడాది జ‌య జాన‌కీ నాయ‌కా.. రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సినిమాల్లో మంచి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది ర‌కుల్. ఇక ఇప్పుడు మ‌హేశ్ స్పైడ‌ర్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అద్భుత‌మైన స్ట్రాట‌జీతో కెరీర్ లో ముందుకెళ్తోంది ర‌కుల్. అచ్చం స‌మంత మాదిరే ర‌కుల్ కూడా చిన్నా పెద్ద హీరోల‌తో క‌లిసిపోతుంది. తెలుగులో ఈ భామ కొత్త‌గా సాధించాల్సిందేమీ లేదిప్పుడు. అందుకే త‌మిళ ఇండ‌స్ట్రీపై ఫోక‌స్ చేసింది.
అప్పుడెప్పుడో కెరీర్ కొత్త‌లో గౌత‌మ్ కార్తిక్ తో అలా మొద‌లైంది రీమేక్ సినిమాలో న‌టించిన ర‌కుల్.. ఇప్పుడు మ‌ళ్లీ స్పైడ‌ర్ తో అర‌వ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతుంది. ఈ చిత్రంతో పాటు కార్తితో వినోద్ అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్న ఖాకీ సినిమాకి ఓకే చెప్పింది. ఇది దివాళికి విడుద‌ల కానుంది. దాంతోపాటు సూర్య హీరోగా సెల్వ రాఘ‌వ‌న్ తెర‌కెక్కించ‌బోయే సినిమాలోనూ ర‌కుల్ హీరోయిన్ గా క‌న్ఫ‌ర్మ అయింది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. త‌మిళ్ లోనే మ‌రో రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా క‌మిటైంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రోవైపు హిందీలో నీర‌జ్ పాండే ద‌ర్శ‌క‌త్వంలో ఐయ్యారే సినిమాలో న‌టిస్తుంది. ఇలా ఏ ఇండ‌స్ట్రీ తీసుకున్నా ఇప్పుడు ర‌కుల్ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.