Rakul Preeth Singh Following Sadhguru Like Mega Couple

చ‌ర‌ణ్, ఉపాస‌న దారిలో ర‌కుల్..

Rakul Preeth Singh Following Sadhguru Like Mega Couple

అవును.. కాస్త ఆలోచించి చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న వెళ్లిన దారిలోనే ఇప్పుడు ర‌కుల్ కూడా వెళ్తుంది. ఇంత‌కీ ఏ విష‌యంలో అనుకుంటున్నారా..? స‌ద్గురు విష‌యంలో.. ర‌కుల్ కు సినిమాలు.. జిమ్ తో పాటు ఆధ్యాత్మిక చింత‌న కూడా ఎక్కువే. ఆమెను చూస్తుంటే అలా అనిపించ‌దు కానీ దేవున్ని న‌మ్మ‌డం.. ఆధ్యాత్మిక విష‌యాలు తెలుసుకోవ‌డంపై ర‌కుల్ బాగానే దృష్టి పెడుతుంది. ఇందులో భాగంగానే న‌వంబ‌ర్ 27న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఆనందపురం మండ‌లంలో జ‌ర‌గ‌బోయే ఇషా గ్రామోత్స‌వానికి హాజ‌రు కానుంది ర‌కుల్. ఈ కార్య‌క్ర‌మానికి స‌ద్గురు వ‌స్తున్నారు. విశాఖ‌ప‌ట్నంలోని రాజీవ్ గాంధీ ఏసి ఇండోర్ స్టేడియంలో ఈ ఈవెంట్ జ‌ర‌గ‌బోతుంది.

Sadhguru Rakul చ‌ర‌ణ్, ఉపాస‌న దారిలో ర‌కుల్..
అక్క‌డే ఇంట‌ర్ విలేజ్ స్పోర్ట్స్ టోర్న‌మెంట్ కూడా జ‌ర‌గ‌నుంది. ఎన్నో గ్రామాల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చి.. వాళ్ల మ‌ధ్య బంధాల‌ను ఇంకా ధృడంగా మార్చ‌డానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ్రామోత్స‌వం కార్య‌క్ర‌మానికి పూనుకుంది. ఇందులో భాగంగానే గ్రామాల మ‌ధ్య ఆట‌లు, సంగీతం పోటీలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌లో ర‌కుల్ తో పాటు స‌ద్గురు కూడా ఒకే వేదిక పంచుకోనున్నారు. స‌ద్గురు సేవ‌లో ఈ మ‌ధ్యే రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న కూడా పాల్గొన్నారు. చిరంజీవి ఇంటికే స‌ద్గురు వ‌చ్చారు. అంతేకాదు.. ఈయ‌న ప్ర‌వ‌చ‌నాల‌ను నిత్యం వింటూనే ఉంటారు మెగా జంట‌. ఇప్పుడు ర‌కుల్ కూడా ఇదే చేస్తుంది. స‌ద్గురు చెప్పే వాక్యాల‌ను విన‌డానికి వ‌స్తుంది ర‌కుల్. ఇదే కార్య‌క్ర‌మానికి నారా లోకేష్, గంటా శ్రీ‌నివాస‌రావ్ లాంటి వాళ్లు కూడా హాజ‌రు కానున్నారు. మొత్తానికి ర‌కుల్ ఆధ్యాత్మిక చింత‌న‌లోకి వెళ్లిపోతుంద‌న్న‌మాట‌.

చ‌ర‌ణ్, ఉపాస‌న దారిలో ర‌కుల్..
0 votes, 0.00 avg. rating (0% score)