అరే.. అలా కోసేసిందేంటో?

Last Updated on by

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ టు ధ్రువ .. పంజాబి కుడి ర‌కుల్ ప్రీత్ ప‌య‌నం ఎంతో ఆస‌క్తిక‌రం. ఒకే ఒక్క సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిన ర‌కుల్ కేవ‌లం నాలుగేళ్ల‌లోనే కోటి అందుకునే తార‌గా ఎదిగేసింది. ఓ వెలుగు వెలిగిన‌న్నాళ్లే దున్నుకోవాలి అన్న చందంగా వ‌రుస‌గా క్రేజీ సినిమాల్లో న‌టించి భారీగా పారితోషికాలు ఖాతాలోకి మ‌ళ్లించింది. అయితే అన్ని దినాలు ఒకేలా ఉంటాయా? ప్ర‌స్తుతం ఈ భామ కెరీర్ డౌన్‌ఫాల్‌లో ఉంది.

తెలివితేట‌లు ఉండాలే కానీ, ఏదైనా ఎలా అయినా మ్యానేజ్ చేయొచ్చ‌ని తెలుసుకున్న ర‌కుల్ ప్ర‌స్తుతం పారితోషికంలో భారీగా కోత పెడుతోందిట‌. ఇప్ప‌టివ‌ర‌కూ అందుకుంటున్న పారితోషికంలో 20 శాతం కోత పెట్టి మ‌రీ నిర్మాత‌ల‌కు రిలీఫ్ ఇస్తోంద‌ని తెలిసింది. ఇన్నాళ్లు స‌క్సెస్ మ‌త్తులో కోటి డిమాండ్ చేసినా, 85ల‌క్ష‌ల‌తో స‌రిపెట్టుకునేది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. అందులోనూ ఇంకా కోసేసి 60ల‌క్ష‌ల మేర పారితోషికానికి దిగొచ్చింద‌ని చెబుతున్నారు. ఆ క్ర‌మంలోనే వ‌రుస‌గా రెండు సినిమాల‌కు సంత‌కాలు చేసింది. వెంకీ- నాగ‌చైత‌న్య‌ల `వెంకీ మామ` చిత్రానికి, ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి సంత‌కాలు చేయ‌డం వెన‌క అంత గేమ్ న‌డిచింద‌న్న‌మాట‌!! బాలీవుడ్‌లోనూ అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది ర‌కుల్‌… కూల్‌గా!!

User Comments