అఖిల్ ల‌వ‌ర్ పెళ్లికి రామ్ చ‌ర‌ణ్

Last Updated on by

జీవితం అంటే అంతే మ‌రి. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రుగుంటే ఈ పాటికి అక్కినేని కోడ‌లిగా ఇంట్లోనే తిరుగుతూ ఉండేది శ్రేయాభూపాల్. కానీ నిశ్చితార్థం త‌ర్వాత క‌థ అడ్డం తిరిగింది. ఏడాది కింది వ‌ర‌కు శ్రేయాభూపాల్ అంటే ఫ‌లానా జివికే మ‌న‌వ‌రాలు అనేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం అఖిల్ మాజీ ప్రేయ‌సి పెళ్లి అంటున్నారు. వీళ్లిద్ద‌రికీ నిశ్చితార్థం అయి.. పెళ్లి వ‌ర‌కు వెళ్లింది వ్య‌వ‌హారం. కానీ అంత‌లోనే బ్రేక‌ప్ అవ‌డం.. అఖిల్ సినిమాల‌తో బిజీ అవ్వ‌డం జ‌రిగిపోయాయి. అయితే ఇప్పుడు స‌డ‌న్ గా శ్రేయాకు ఓ ఎన్నారైతో పెళ్లి జ‌రిగింది. ఈ పెళ్లికి ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద‌ల‌తో పాటు రాజ‌కీయ నాయకులు కూడా వ‌చ్చారు.

Ram charan attends Akhil Ex Girl Friend shriya bhoopal marriage

ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌నకు శ్రేయాభూపాల్ బంధువులు. దాంతో పెళ్లిప‌నులు కూడా ద‌గ్గ‌రుండి చూసుకున్నారు ఈ మెగా జంట‌. ఇప్పుడు పెళ్లిలో కూడా చిరుతో పాటు చ‌ర‌ణ్ క‌నిపించాడు. అక్కినేని కుటుంబం నుంచి మాత్రం ఈ వేడుక‌కు ఒక్కరు కూడా రాలేదు. మ‌రోవైపు అఖిల్ మాత్రం ఇవేవీ ప‌ట్టించుకోకుండా హాయిగా లండ‌న్ లో త‌న మూడో సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అక్క‌డ బిజీ అయిపోతే ఈ వార్త‌ల నుంచి మైండ్ డైవ‌ర్ష‌న్ చేయొచ్చ‌ని ఆలోచిస్తున్నాడు అక్కినేని వార‌సుడు. అంతేకాదు.. ఇప్ప‌ట్లో తాను అస‌లు పెళ్ళి చేసుకోన‌ని తెగేసి చెప్పేసాడ‌ట ఈ సిసింద్రీ. మొత్తానికి అఖిల్ కు శ్రేయా షాక్ భారీగానే త‌గిలింది పాపం..!

User Comments