పెద్దాయ‌న్ని టార్గెట్ చేసిన చ‌ర‌ణ్

Last Updated on by

గెలిచిన ఉత్సాహంలో ఉన్నాడిప్పుడు రామ్ చ‌ర‌ణ్. రంగ‌స్థ‌లంతో ఈయ‌న న‌టుడిగా కూడా ప‌దిమెట్లు పైకి ఎక్కేసాడు. ప్ర‌స్తుతం ఈయ‌న బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. రెండు వారాల పాటు ఇక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. చ‌ర‌ణ్ తో పాటు కైరా అద్వాని.. ప్ర‌శాంత్.. స్నేహ కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ త‌ర్వాత పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం యూర‌ప్ వెళ్ల‌నున్నారు చిత్ర యూనిట్. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుందంటూ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఆర్ సి 12 సంక్రాంతి అంటూ ఓ పోస్ట‌ర్ విడుద‌లైంది.

ఇప్ప‌టికే సంక్రాంతికి ఎన్టీఆర్ బ‌యోపిక్ విడుద‌ల కానుంద‌ని ప్ర‌క‌టించాడు బాల‌య్య‌. ఈ చిత్ర షూటింగ్ అక్టోబ‌ర్ నుంచి మొద‌లు కానుంది. క్రిష్ ఈ చిత్రాన్ని మూడు నెల‌ల్లోనే పూర్తి చేస్తానంటున్నాడు. ఈ రెండు సినిమాలు పండ‌క్కి వ‌స్తే ఖచ్చితంగా భారీ యుద్ధం త‌ప్ప‌దు. ఎందుకంటే సంక్రాంతి బాల‌య్య‌కు బాగా క‌లిసొచ్చిన పండ‌గ‌. గ‌తేడాది శాత‌క‌ర్ణి.. ఈ ఏడాది జై సింహాతో రెండు విజ‌యాలు అందుకున్నాడు బాల‌కృష్ణ‌. ఇక ఇప్పుడు తండ్రి బ‌యోపిక్ తో వ‌స్తున్నాడు. దీనిపై కూడా భారీ అంచ‌నాలుంటాయి. మ‌రి.. చ‌ర‌ణ్ తో పెద్దాయ‌న పోరు ఎలా ఉండ‌బోతుందో..?

User Comments