రామ్ చరణ్ నిజంగానే గ్యాంగ్ లీడర్

Last Updated on by

ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో చాన్స్ వ‌స్తే తండ్రి సినిమాల్లో ఏది రీమేక్ చేస్తారంటే.. గ్యాంగ్ లీడ‌ర్ అని చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. విజేత కూడా అన్నాడు కానీ ముందు ఛాన్స్ మాత్రం గ్యాంగ్ లీడ‌ర్ కే ఇస్తాన‌న్నాడు మెగా వార‌సుడు. ఇప్పుడు అన్న‌మాట నిల‌బెట్టుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లంతో బిజీగా ఉన్న చ‌ర‌ణ్.. బోయ‌పాటి సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా పూర్తైపోయింది. మూడు రోజులే ఈ షెడ్యూల్ జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రిలో రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇందులో చ‌ర‌ణ్ కూడా పాల్గొంటాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్. ప్ర‌స్తుతం ఈమె భ‌ర‌త్ అనే నేనులో మ‌హేశ్ తో రొమాన్స్ చేస్తుంది. అది సెట్స్ పై ఉండ‌గానే చ‌ర‌ణ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమా గురించి ఓ కొత్త న్యూస్ బ‌య‌టికి వ‌చ్చింది. అదే ఈ సినిమా చిరంజీవి గ్యాంగ్ లీడ‌ర్ ను పోలి ఉంటుంద‌ని..! అవును.. దానికి సాక్ష్యాలు కూడా లేక‌పోలేవు.

రామ్ చ‌ర‌ణ్-బోయ‌పాటి సినిమాలో ప్ర‌శాంత్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇది చ‌ర‌ణ్ కు పెద్ద‌న్న‌య్య పాత్ర అని తెలుస్తుంది. ఇక ఇప్పుడు న‌వీన్ చంద్ర మ‌రో అన్న‌య్య‌గా ఎంపిక‌య్యాడు. అందాల రాక్ష‌సిలో ఈయ‌న న‌టించాడు. గ్యాంగ్ లీడ‌ర్ లోనూ చిరంజీవికి ఇద్ద‌రు అన్న‌య్య‌లు ఉంటారు. ఒక‌రు ముర‌ళి మోహ‌న్.. మ‌రొక‌రు శ‌ర‌త్ కుమార్. ఇప్పుడు బోయ‌పాటి సినిమాలోనూ ఇద్ద‌రు అన్న‌య్య‌లు ఉన్నారు. ఇక విల‌న్ గా అందులో రావుగోపాల‌రావు ర‌ప్ఫాడిస్తే.. ఇక్క‌డ వివేక్ ఒబేరాయ్ న‌టిస్తున్నాడు. ఇది లెజెండ్ లో జ‌గ‌ప‌తిబాబు క్యారెక్ట‌ర్ కంటే చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అంటున్నాడు బోయ‌పాటి శీను. ఈ చిత్రంలో మ‌రో స‌ర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఎమోష‌న్. హై ఓల్టేజ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం రూపొందుతుంద‌ని చెబుతున్నాడు బోయ‌పాటి. మ‌రి ఇది గ్యాంగ్ లీడ‌ర్ లా ఉంటుందా.. లేదంటే అక్క‌డ్నుంచి స్పూర్తి పొందుతున్నాడా అనేది ప‌క్క‌న‌బెడితే చ‌ర‌ణ్ కు గ్యాంగ్ లీడ‌ర్ గా చూడ‌టం మాత్రం మెగా అభిమానుల‌కు పండ‌గే పండ‌గ‌.

User Comments