మొబైల్స్ అమ్ముకుంటున్న చ‌ర‌ణ్

Last Updated on by

అదేంటి రామ్ చ‌ర‌ణ్ ఏంటి.. మొబైల్స్ అమ్ముకోవ‌డం ఏంటి అర్థం లేకుండా అనుకుంటున్నారా..? ఇది విన‌డానికి కాస్త సిల్లీగా అనిపించినా ఇదే నిజం మ‌రి. నిజంగానే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ మొబైల్స్ అమ్ముకోబోతున్నాడు. అంటే యాడ్ రంగంలోకి వ‌స్తున్నాడ‌న్న‌మాట‌. ఈ మ‌ధ్య కాలంలో యాడ్స్ కు కాస్త దూరంగా ఉన్న చ‌ర‌ణ్.. మ‌ళ్లీ ఇప్పుడు ఆ వైపుగా అడుగేస్తున్నాడు. రంగ‌స్థ‌లం త‌ర్వాత చ‌ర‌ణ్ ఇమేజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. దానికి ముందు కూడా మాస్ ఇమేజ్ ఉన్నా కూడా ఇప్పుడు చ‌ర‌ణ్ రేంజ్ మ‌రో స్థాయిలో ఉంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. రంగ‌స్థ‌లం బ్లాక్ బ‌స్ట‌ర్.. ఇక ఇప్పుడు బోయ‌పాటితో సినిమా చేస్తున్నాడు.. ఆ వెంట‌నే రాజ‌మౌళి ఉన్నాడు.. ఆ త‌ర్వాత కొర‌టాల‌.. ఇలా లైన్ చూస్తుంటే చెర్రీ రేంజ్ ఏంటో అర్థ‌మైపోతుంది.

అందుకే కంపెనీలు కూడా ఇప్ప‌ట్నుంచే చ‌ర‌ణ్ వెంట ప‌డుతున్నాయి. తాజాగా హ్యాపీ మొబైల్స్ కు చ‌ర‌ణ్ బ్రాండ్ అంబాసి డ‌ర్ గా ఎంపిక‌య్యాడ‌ని తెలుస్తుంది. R యు వాంట్ టూ C అంటూ ప్ర‌మోష‌న్ మొద‌లుపెడుతుంది ఈ సంస్థ‌. అంటే రామ్ చ‌ర‌ణ్ లోని R C అనే రెండు అక్ష‌రాల‌ను క‌లిపి ప్ర‌మోట్ చేస్తున్నార‌న్న‌మాట‌. త్వ‌ర‌లోనే ఈ మొబైల్ యాడ్ షూటింగ్ లో చ‌ర‌ణ్ పాల్గొంటాడు. ఇదివ‌ర‌కు కూడా కొన్ని యాడ్స్ చేసినా.. ఈ మ‌ధ్య మ‌ళ్లీ బ్రేక్ ఇచ్చాడు చ‌ర‌ణ్. ఇప్పుడు మ‌ళ్లీ యాడ్స్ వైపు అడుగేస్తున్నాడు.

User Comments