చేప‌ల‌తో మాట్లాడుతున్న చెర్రీ

Last Updated on by

మ‌నిషి జీవ‌నం ఒత్తిడులమ‌యం. బిజీ లైఫ్‌స్టైల్ వ‌ల్ల వ‌చ్చిన ఎన్నో స‌మ‌స్య‌లకు ఏకైక ప‌రిష్కారం ప్ర‌కృతితో మ‌మేకం అవ్వ‌డం. అందుకే మ‌న స్టార్ హీరోలు ఏవైనా ప‌ల్లెటూర్ల‌లో షూటింగుల‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ ప్ర‌కృతితో మమేక‌మ‌వుతూ సంతోష‌ప‌డుతుంటారు. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ ఓవైపు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలోని సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. ప‌నిలో ప‌నిగా ఈ సినిమాని పల్లెటూళ్ల‌లో తెర‌కెక్కించ‌డం.. అది కూడా ఫామ్‌హౌస్‌లో .. చెరువు ప‌రిస‌రాల్లో తెర‌కెక్కిస్తుండ‌డంతో అక్క‌డ షాట్ గ్యాప్‌లో అత‌డేం చేస్తున్నాడో చూస్తే షాక్ తినాల్సిందే.

ram charan busy fishing

చ‌ర‌ణ్‌కి మ‌ధ్య‌లో ఎప్పుడు స‌మ‌యం చిక్కిందో చెర్రీ వెంట‌నే వెళ్లి చేప‌ల చెరువు గ‌ట్టున వాలిపోయాడు. అక్క‌డ చేప‌లకు ఆహారం పెట్టాడు. అవి ట‌ప‌ట‌పా గెంతుతూ .. తుళ్లుతూ చెర్రీపై నీళ్లు చ‌ల్లేస్తుంటే అత‌డు ఉలుకులిక్కి ప‌డుతున్నాడు. మ‌రోచోట స్విమ్మింగ్ పూల్ అంచుపై నిల‌బ‌డి చుట్టూ ఉన్న ప్ర‌కృతిని వీక్షిస్తున్నాడు. దూరంగా బుర‌ద‌నీరు.. ఆ నీటి గ‌ట్టున అర‌టి చెట్టు ఆహా.. ఆ ప‌ల్లెటూరి అందం వ‌ర్ణించేందుకు ప‌దాలు చాల‌వు. ఎంత పెద్ద స్టార్ అయినా .. ఒక సామాన్యుడిగా బ‌త‌క‌డం అంత గొప్ప‌త‌నం వేరొక‌టి ఉండ‌ద‌ని చెర్రీకి ఈవేళ అర్థ‌మైన‌ట్టుంది. ఈ ఫోటోల్ని ఉపాస‌న స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఇలా రిలాక్స‌య్యాక తిరిగి చెర్రీ త‌న డ్యూటీలో చేరిపోతుంటాడు కొత్త ఎన‌ర్జీతో అంటూ కామెంట్‌ని పోస్ట్ చేశారు ఉపాస‌న‌.

User Comments