షాక్ ఇచ్చిన బోయ‌పాటి – చ‌ర‌ణ్

Last Updated on by

కొంప‌దీసి సినిమా కానీ క్యాన్సిల్ చేసారా ఏంటి అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదులే. కానీ మ‌రో విష‌యంలో మాత్రం బోయ‌పాటి-చ‌ర‌ణ్ షాక్ ఇచ్చారు. అది కూడా శాటిలైట్ రైట్స్ విష‌యంలో. సినిమా ఎలా ఉంటుందో తెలియ‌దు.. ఎలా వ‌స్తుందో తెలియ‌దు.. అస‌లు ఎలా తీస్తాడో తెలియ‌దు. ఇవేవీ తెలియ‌కుండానే రికార్డ్ రేట్ కు బోయ‌పాటి- రామ్ చ‌ర‌ణ్ సినిమా అమ్ముడైపోయింది. అస‌లు ఏం చూసి ఆఫ‌ర్ చేస్తున్నారో తెలియ‌దు కానీ ఈ మ‌ధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల‌కు శాటిలైట్ రెక్క‌లు వ‌చ్చేస్తున్నాయి. అస‌లు సినిమా బ‌డ్జెట్ లో స‌గానికి పైగా ఈ డిజిట‌ల్.. శాటిలైట్.. డ‌బ్బింగ్ అంటూ వ‌చ్చేస్తున్నాయి. ఇప్పుడు బోయ‌పాటి-చ‌ర‌ణ్ సినిమాకు కూడా ఇంతే. ఒక‌టి రెండు కాదు.. దాదాపుగా 22 కోట్లు పెట్టి బోయపాటి-చ‌ర‌ణ్ సినిమా రైట్స్ తీసుకుంది ఓ ప్ర‌ముఖ ఛానెల్. బోయపాటికి హిందీ మార్కెట్ బాగానే ఉంది. డబ్బింగ్ రైట్స్ అంత ఎక్కువ పలకడానికి ఇది కూడా ఒక కారణం.

ప‌వ‌న్, మ‌హేష్ సినిమాల‌కు త‌ప్ప ఇంత రేట్ రావ‌డం చిన్న విష‌యం కాదు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. మార్చ్ 30 వ‌ర‌కు బోయ‌పాటి సినిమాపై దృష్టి పెట్ట‌డం క‌ష్ట‌మే. ఈ చిత్రం రాజస్ధాన్ బ్యాక్ డ్రాప్ లో జ‌ర‌గనుంది. రెండో షెడ్యూల్ అక్క‌డే ప్లాన్ చేస్తున్నాడు బోయ‌పాటి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కైరాఅద్వాని హీరోయిన్ గా న‌టిస్తుంది. చ‌ర‌ణ్ లుక్ పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడు బోయ‌పాటి. ఇప్ప‌టికే ఓ కొత్త లుక్ ట్రై చేసాడు చ‌ర‌ణ్. ఈ మ‌ధ్యే ఆ లుక్ కూడా బ‌య‌టికి వ‌చ్చింది. రంగ‌స్థ‌లం కోసం పెంచిన గ‌డ్డంలా కాకుండా మ‌రోలా గ‌డ్డాన్ని మార్చేసాడు చ‌ర‌ణ్. దానికి తోడు ఒంటిపై టాటూస్ కూడా క‌నిపించ‌బోతున్నాయి. ఎనిమిది నెల‌ల్లో షూటింగ్ పూర్తిచేసి.. ద‌స‌రాకు సినిమా విడుద‌ల చేయ‌నున్నాడు బోయ‌పాటి శీను. డివివి దాన‌య్య నిర్మాత‌. నాయ‌క్, బ్రూస్లీ సినిమాల‌ త‌ర్వాత ఆయ‌న నిర్మాణంలో చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా ఇది.

User Comments