చ‌ర‌ణ్.. ఛ‌లో బాలీవుడ్..!

Last Updated on by

తెలిసి తెలియ‌కుండా ఓ సారి తొంద‌ర‌ప‌డి అడుగు వేసాడు రామ్ చ‌ర‌ణ్. బాలీవుడ్ కు వెళ్ల‌డం త‌ప్పు కాదు.. తొలి సినిమాతోనే జంజీర్ లాంటి క్లాసిక్ ని ట‌చ్ చేసి త‌ప్పు చేసాడు చ‌ర‌ణ్. అక్క‌డ స్టార్ హీరోలు కూడా భ‌య‌ప‌డే స‌బ్జెక్ట్ ఎంచుకుని విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. ఆ సినిమా ఫ్లాప్ అయిన త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ గురించి ఆలోచించ‌లేదు ఈ హీరో. అయితే ఇప్ప‌టికీ బాలీవుడ్ వెళ్లాల‌ని.. అక్క‌డ హిట్ కొట్టాల‌నే ఆశ మాత్రం రామ్ చ‌ర‌ణ్ లో క‌న‌బ‌డుతుంది. అది ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌పెడుతూనే ఉంటాడు చ‌ర‌ణ్.

తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న‌కు బాలీవుడ్ దారులు ఇంకా మూసుకుపోలేద‌న్నాడు ఈ హీరో. ఇప్ప‌టికీ మంచి క‌థ దొరికితే అక్క‌డ సినిమా చేస్తానంటున్నాడు. బాలీవుడ్ లో త‌న‌కు అక్క‌డ రాజ్ కుమార్ హిరాణి, విశాల్ భ‌ర‌ద్వాజ్ అంటే ఇష్ట‌మ‌ని.. వాళ్ల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పాడు. అయితే రెండోసారి ప్ర‌య‌త్నం చేస్తే క‌చ్చితంగా మంచి క‌థ‌తోనే వెళ్తాన‌ని.. ఈ సారి వెళ్తే విజ‌యం వ‌చ్చేలా చూసుకుంటాన‌ని చెబుతున్నాడు చ‌ర‌ణ్. అంటే మ‌న‌సులో బాలీవుడ్ కు వెళ్లాల‌ని ఉంది. కానీ ఇప్పుడు కాదు.. క‌థ కుదిర్తే అంటున్నాడు. మ‌రి ఆ క‌థ ఎవ‌రు కుదిరిస్తారో చూడాలి.

User Comments