తండ్రి దారిలో వెళ్తోన్న రామ్ చ‌ర‌ణ్..

య‌ధా తండ్రి.. త‌ధా త‌న‌య అంటారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్, చిరంజీవిలు కూడా ఇలాగే ఉన్నారు. ఈ మ‌ధ్య ఏమైందో ఏమో గానీ రామ్ చ‌ర‌ణ్ మ‌రీ సాత్వికంగా మారిపోయాడు. ఓ సాధువుగా క‌నిపిస్తున్నాడు. ఎక్క‌డికి వెళ్లినా లాల్చి పైజామాలోనే క‌నిపిస్తున్నాడు. సినిమా ఫంక్ష‌న్ ల‌తో పాటు.. పెళ్లిళ్లు పేరంటాల‌కు కూడా చ‌ర‌ణ్ ఒకే గెట‌ప్పులో క‌నిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈయ‌న రంగ‌స్థ‌లం నుంచి కాస్త బ్రేక్ తీసుకుని కేర‌ళ వెళ్లాడు. వారం రోజులు హాలీడేస్ ఉండేస‌రికి కేర‌ళ వెళ్లాడు చ‌ర‌ణ్ .అయితే ఆయ‌న వెళ్లిందో ఏ వెకేష‌న్ కో.. విహారానికో అనుకుంటే పొర‌పాటే. చ‌ర‌ణ్ వెళ్లింది ఎంజాయ్ చేయ‌డానికి కాదు.. అక్క‌డ ప్ర‌కృతిని ఆస్వాదించ‌డానికి.. ప్ర‌కృతి వైద్యాన్ని అందుకోడానికి. అవును.. మొన్న‌టి వ‌ర‌కు రంగ‌స్థ‌లం కోసం భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ చేసాడు చ‌ర‌ణ్.

సుకుమార్ కూడా గ‌త నెల రోజులుగా బ్రేక్ ఇవ్వ‌కుండా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో స‌మంత త‌న పెళ్లి కార‌ణంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంది. అందుకే ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా బ్రేక్ తీసుకుని కేర‌ళ‌కు ఆయుర్వేద వైద్యానికి వెళ్లాడు. అక్క‌డ నేచ‌ర్ క్యూర్ హాస్పిట‌ల్ కు టాలీవుడ్ నుంచి చాలా మంది ప్ర‌ముఖులు వెళ్తున్నారు. సింపుల్ గా నేచ‌ర్ నుంచి తీసిన మ‌సాజ్ ల‌తో ఒంటి నొప్పుల‌ను తీసేసి.. రీ ఫ్రెషింగ్ చేస్తుంటారు అక్క‌డ‌. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.. గ్లామ‌ర్ పెరుగుతుంది. ఖైదీ నెం.150కి ముందు చిరు కూడా కేర‌ళ వెళ్లి ఆయుర్వేద వైద్యం తీసుకొచ్చాడు. ఇప్పుడు తండ్రి బాట‌లోనే త‌న‌యుడు కూడా వెళ్తున్నాడు.