రామ్చరణ్ 30 రోజులు ఇచ్చాడట

చిరంజీవి సినిమాలో రామ్చరణ్ నటించడం పక్కా అయిపోయిందంటున్నాయి మెగా కాంపౌండ్ వర్గాలు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతున్న సినిమాలోనే తండ్రీ కొడుకులు కలిసి సందడి చేయబోతున్నారట. చిరు సినిమాలో చరణ్, చరణ్ సినిమాలో చిరు కనిపించడం కొత్తేమీ కాదు. కాకపోతే అవన్నీ అతిథి పాత్రలే. ఈసారి మాత్రం పూర్తిస్థాయి పాత్రని చేస్తున్నాడట చరణ్.

అందుకోసం 30 రోజులు కాల్షీట్లు కూడా కేటాయించినట్టు సమాచారం. 30 రోజులు కాల్షీట్లు అంటే చాలా పెద్ద పాత్రే. కీలకమైన పాత్ర కావడంతో అన్ని రోజులు కావల్సిందే అని అడిగాడట కొరటాల. దాంతో ఏప్రిల్ నుంచి వస్తానని కాల్షీట్లు పక్కా చేశాడట చరణ్. మార్చి నెలాఖరులోపు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ పూర్తి కాబోతోందట. ఆ వెంటనే చిరు సినిమా కోసం చెర్రీ రంగంలోకి దిగబోతున్నాడట. `గోవింద్ ఆచార్య` అనే పేరు ప్రచారంలో ఉన్న ఆ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే పాటతో చిత్రీకరణ మొదలుపెట్టారు.