వావ్.. బాలీవుడ్ హీరో కూతురితో మెగా హీరో

 

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ‘రంగస్థలం 1985’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయననున్నట్లు చెర్రీ మొన్నీమధ్యే ప్రకటించాడు కూడా. ఇదిలా ఉంటే, ఇప్పుడు మళ్ళీ ఎప్పటినుంచో నలుగుతున్న రామ్ చరణ్ – మణిరత్నం ప్రాజెక్ట్  చర్చలకు రావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ ఓసారి ఉంటుందని, ఓసారి ఉండదని వార్తలు రాగా.. వరుస ఫ్లాపుల్లో ఉన్న మణిరత్నంతో పనిచేయడానికి చెర్రీ రెడీగా లేదని ఆ మధ్య మీడియా గట్టిగానే చెప్పింది.
కానీ, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం గ్యారెంటీ అని టాక్ వినిపిస్తుండటం గమనార్హం. ఇక ఈసారి ఏకంగా హీరోయిన్ పేరు కూడా బలంగా వినిపిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా ఆ హీరోయిన్ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ అని టాక్ వినిపిస్తుండటం.. చెర్రీ సినిమాతోనే ఈ యంగ్ బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని చెబుతుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఇప్పటికే తన గ్లామర్ తో కుర్రాళ్లను పడేసిన సారా అలీ ఖాన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తుందోనని చాలామంది వెయిట్ చేస్తున్నారు.
అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ – మణిరత్నం కాంబోలో తెరకెక్కబోయే రొమాంటిక్ లవ్ స్టోరీలో మెగా హీరోతో రొమాన్స్ చేయనుందని వార్తలు వ్యాపించడంతో బీటౌన్ ఆశ్చర్యపోతుంది. మరోవైపు, తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కబోయే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మణిరత్నం బిజీగా ఉన్నాడని ప్రచారం జరుగుతుండటం చాలామందిని కన్ఫ్యూషన్ లో పడేస్తోంది. మన మెగా సైడ్ నుంచి ఈ ప్రాజెక్ట్ పై ఎటువంటి ఇంట్రెస్ట్ లేని పరిస్థితులు కనిపిస్తుంటే.. మరో సైడ్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అంటుండటం ఓ క్లారిటీ లేకుండా చేస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు సైఫ్ అలీఖాన్ తన కూతురిని ఈ ప్రాజెక్ట్ వైపు వెళ్లనిస్తాడా అంటే, కొంచెం కష్టమేనని బీటౌన్ మీడియా కూడా అభిప్రాయపడుతోంది. మరి చూద్దాం ఏమవుతుందో.