చ‌ర‌ణ్ కు పోటీగా వ‌స్తోన్న మ‌హేష్

అదేంటో కానీ రామ్ చ‌ర‌ణ్, మ‌హేష్ మ‌ధ్య ఎప్పుడూ ఏదో తెలియ‌ని వార్ న‌డుస్తూనే ఉంటుంది. బాక్సాఫీస్ వార్ లో కూడా ఎప్పుడూ ఘ‌ట్ట‌మ‌నేని హీరోతో పోటీకి సై అంటుంటాడు మెగా వార‌సుడు. అయితే ఈ సారి మాత్రం విచిత్రంగా మెగా వార‌సుడికే మ‌హేష్ పోటీకి వెళ్తున్నాడు. విడుద‌ల విష‌యంలో కాదులే కానీ ఆడియో విష‌యంలో మాత్రం ఈ సారి చ‌ర‌ణ్ తో పోటీకి వ‌స్తున్నాడు మ‌హేష్. ఈ ఇద్ద‌రూ ఉగాదిని త‌మ సినిమాల‌కు కేరాఫ్ గా మార్చుకున్నారు. కొత్త ఏడాదిని కొత్తగా త‌మ పాట‌ల‌తో వెల్ క‌మ్ చెబుతున్నారు. మార్చ్ 18న రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. వైజాగ్ లో దీనికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మించింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. మార్చ్ 30న సినిమా విడుద‌ల కానుంది. వైజాగ్ లో జ‌ర‌గ‌బోయే రంగ‌స్థ‌లం ఈవెంట్ కు చిరంజీవి ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. ఇక ఇదే రోజు మ‌హేష్ కూడా త‌న భ‌ర‌త్ అనే నేనులో తొలిపాట‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇక్క‌డ విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాల‌కు దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌డం. మొత్తానికి ఈ పాట‌ల స‌మ‌రం ఉగాది రోజు ఎలా ఉండ‌బోతుందో..?