కొడుకు వద్దన్నాడు… తండ్రి కావాలన్నాడు

Last Updated on by

కావాల‌నుకున్న‌పుడు మంచి క‌థ దొర‌క‌దు.. మంచి ద‌ర్శ‌కులు అస‌లే దొర‌క‌రు. వాళ్లు ఉన్న‌పుడే ముందుగానే లాక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న‌ది కూడా ఇదే. అయినా ఇన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాడు.. ద‌ర్శ‌కుల‌ను ఎప్పుడు ఎలా లాక్ చేసుకోవాలో మెగాస్టార్ కు తెలియ‌దా..? అందుకే ఇప్పుడు సైరా ఇంకా పూర్తి కాక‌ముందే నెక్ట్స్ ఇద్ద‌రు టాప్ ద‌ర్శ‌కుల‌ను లైన్ లో పెట్టాడు. అందులో బోయ‌పాటి ప్ర‌స్తుతం బిజీగా ఉన్నా కూడా కొర‌టాల శివ‌తో సినిమా ఫైన‌ల్ చేసాడనే వార్త‌లు వినిపిస్తున్నాయి. అస‌లే సామాజిక క‌థ‌లకు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ద్ది చెప్ప‌డంలో కొర‌టాల అందె వేసిన చేయి. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన నాలుగు సినిమాల్లోనూ ఇదే చేసాడు కొర‌టాల‌. ఈ నాలుగు కూడా బాక్సాఫీస్ ను కుమ్మేసాయి. అప్పట్లో కొరటాల రామ్ చరణ్ తో సినిమా చేయాలి కానీ అది ఆగిపోయింది.

ఇప్పుడు అఖిల్ సినిమా ఉంద‌నుకున్నా అదిప్పుడు లేద‌ని తెలుస్తుంది. మూడు నెలలు రెస్ట్ తీసుకున్న త‌ర్వాత త‌ర్వాతి సినిమాపై దృష్టి పెడ‌తాన‌ని చెప్పాడు కొర‌టాల‌. ఈ లోపు చిరంజీవిని క‌లిసి త‌న ద‌గ్గ‌ర ఉన్న ఓ క‌థ‌ను చెప్పాడ‌ని తెలుస్తుంది. ఇది కూడా పూర్తిగా సోష‌ల్ మెసేజ్ ఉన్న క‌థే. కొర‌టాల టేకింగ్ గురించి ఇప్ప‌టికే ఓ ఐడియా ఉన్న చిరు కూడా సినిమా చేద్ధామ‌నే మాట ఇచ్చిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌ట్లో మ‌రో సినిమా ఏదీ పెట్టుకో కుండా చిరంజీవి క‌థ‌పైనే కొర‌టాల కూర్చోబోతున్నాడ‌ని తెలుస్తుంది. సైరా షూటింగ్ కూడా వ‌చ్చే ఏడాది మార్చ్ లోపు పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు మెగాస్టార్. ఆ త‌ర్వాత కొర‌టాల-చిరంజీవి కాంబినేష‌న్ క‌ల‌వ‌బోతుంది. ఈ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుందో..?

User Comments