చెర్రీ సొంతిల్లు.. మైండ్‌ బ్లాంకే!

Last Updated on by

సినీ సెల‌బ్రిటీల ఖ‌రీదైన ఇళ్ల‌కు సంబంధించిన‌ వార్త‌లు ఫ్యాన్స్ స‌హా జ‌నాల్లో అమితాస‌క్తిని క‌లిగిస్తుంటాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే తార‌ల ఇల్లు ఇంద్ర‌భ‌వ‌నాల్ని త‌ల‌పిస్తూ త‌ళుకులీనుతుంటాయి. బాలీవుడ్ క్రేజీ హీరో షారుక్‌ఖాన్ ఇల్లు `మ‌న్న‌త్` గొప్ప‌గా పాపుల‌ర్ అయింది. అదే విధంగా బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ..జ‌ల్సా, ప్ర‌తీక్ష, ర‌జ‌నీకాంత్ ఖ‌రీదైన భ‌వంతి, పూరిజ‌గ‌న్నాథ్ కేవ్ (23 కోట్లు) వార్త‌ల్లో నిలిచాయి. అయితే వీటన్నింటినీ త‌ల‌ద‌న్నే రీతిలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చ‌ర‌ణ్ కొత్త ఇంటిని సిద్ధం చేసుకుంటున్నారు. హైద‌రాబాద్‌లోనే అత్యంత ఖ‌రీదైన జూబ్లీహిల్స్‌లో  56 కోట్లతో ఓ నూత‌న భ‌వంతిని రామ్ చ‌ర‌ణ్ సొంతం చేసుకున్నారు. ఈ వార్త విన్న వాళ్ల‌కి మైండ్ బ్లాంక‌వుతోంది.
గ‌త కొంత కాలంగా తండ్రి చిరంజీవితోనే క‌లిసి వుంటున్న రామ్‌చ‌ర‌ణ్ కొత్తగా జూబ్లీహిల్స్‌లో నూత‌న భ‌వంతిలోకి మార‌బోతున్నాడ‌ని తెలిసింది. ఇందు కోస‌మే 56 కోట్ల వ్య‌యంతో అబ్బుర‌ప‌రిచే రీతిలో ఓ భ‌వింతిని సిద్ధం చేసుకున్నార‌న్న‌ది తాజాగా వినిపిస్తోంది. 1300 కోట్ల‌కు వార‌సుడైన (అత్తిల్లు, తండ్రి ఆస్తితో క‌లుపుకుని) రామ్‌చ‌ర‌ణ్ 56 కోట్ల భ‌వంతిని నిర్మించుకోవ‌డం పెద్ద విష‌య‌మేమీ కాద‌ని, పూరి లాంటి ద‌ర్శ‌కుడే 23 కోట్ల‌తో కేవ్‌ని నిర్మించుకుంటే రామ్‌చ‌ర‌ణ్ 56 కోట్లు వెచ్చించ‌డం త‌క్కువే అంటున్నారు. అన్న‌ట్టు రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం చిరంజీవి హీరోగా దాదాపు 300 కోట్ల వ్య‌యంతో `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గా రామ్‌చ‌ర‌ణ్ 56 కోట్ల విలాస‌వంత‌మైన ఇంట్లో ప్ర‌వేశిస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

User Comments