రంగ‌స్థ‌లం వ‌చ్చేసిందిరో..!

Last Updated on by

స‌మ్మ‌ర్ లో సంచ‌ల‌నాలు సృష్టించిన రంగ‌స్థ‌లం వ‌చ్చేసింది. విడుద‌లైన 45 రోజుల త‌ర్వాత ఒరిజిన‌ల్ ప్రింట్ విడుద‌ల చేసారు అమేజాన్ ప్రైమ్. ఇక ఇప్ప‌ట్నుంచీ సిట్టిబాబును ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. అమేజాన్ ప్రైమ్ వీడియోస్ లో స‌భ్య‌త్వం ఉన్న వాళ్ల‌కు రంగ‌స్థ‌లం అందు బాటులోకి వ‌చ్చేసింది. ఇక నుంచి మీ ఫోన్ లోనే జిగేల్ రాణిని కావాల్సిన‌ప్పుడు చూడొచ్చు.. సిట్టిబాబును ఇష్ట‌మొచ్చిన‌న్ని సార్లు పిల‌వొచ్చు.. రామ‌ల‌క్ష్మితో ఎంత స‌క్క‌గున్న‌వే అంటూ క‌బుర్లు చెప్పుకోవ‌చ్చు. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మార్చ్ 30న విడుద‌లైంది.

నిజానికి రిలీజైన 30 రోజులకే అమేజాన్ లో వ‌చ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ అలా చేస్తే బ‌య్య‌ర్ల‌కు న‌ష్టం అని ఆ గ‌డువును మ‌రో 15 రోజులు పొడిగించారు. అందుకే రెండు వారాల ముందే రావాల్సిన రంగ‌స్థ‌లం.. మే 14 అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు విడుద‌లైంది. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 121 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఏడో వారంలో కూడా అక్క‌డ‌క్క‌డా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం విశేషం. రంగ‌స్థ‌లం వ‌చ్చిన త‌ర్వాత ఛ‌ల్ మోహ‌న్ రంగ.. కృష్ణ్రార్జున యుద్ధం.. భ‌ర‌త్ అనే నేను.. నా పేరు సూర్య‌.. అవేంజ‌ర్స్.. ఇలా ఇన్ని సినిమాలు వ‌చ్చాయి. అయినా కూడా ఈ సినిమా జోరు మాత్రం త‌గ్గ‌లేదు. మొత్తానికి ఇప్పుడు అమేజాన్ లో ఒరిజిన‌ల్ ప్రింట్ విడుద‌ల కావ‌డంతో రంగ‌స్థ‌లం ర‌న్ కు ముగింపు ప‌డ్డ‌ట్లే..!

User Comments