రంగ‌స్థ‌లం కూడా అక్క‌డేనా..?

Last Updated on by

తెలుగు సినిమా మెల్లమెల్ల‌గా హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి వెళ్లిపోతుంది. ఇక్క‌డి వేడుక‌ల‌న్నీ అక్క‌డ జ‌రుగుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో చాలా సినిమాల ఆడియో వేడుక‌లు.. ప్రీ రిలీజ్ వేడుక‌లు హైద‌రాబాద్ లో కాకుండా అమ‌రావ‌తిలోనే జ‌రుగుతున్నాయి. ఇప్పుడు రంగ‌స్థ‌లం ఆడియో వేడుక కూడా అక్క‌డే జ‌ర‌గ‌బోతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ విష‌యంపై ద‌ర్శ‌క నిర్మాత‌ల నుంచి ఎలాంటి క్లారిటీ రాక‌పోయినా.. ఈవెంట్ మేనేజ్ చేసే శ్రేయాస్ మీడియా మాత్రం క‌న్ఫ్యూజ‌న్ కు తెర‌దించేసింది. మార్చ్ 18న వైజాగ్ లో భారీగా రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌బోతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రంగస్థ‌లంలో కొత్త కొత్త విష‌యాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఇందులో సీనియ‌ర్ ఎన్టీఆర్ కు సంబంధించిన స‌న్నివేశాలు ఉంటాయ‌ని తెలుస్తుంది. ఎందుకంటే క‌థ 80ల్లో సాగుతుంది కాబ‌ట్టి.. అప్ప‌టి రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ప్ర‌స్థావ‌న సినిమాలో వ‌స్తుంద‌ని తెలుస్తుంది. ఈ సీన్స్ అన్నీ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయంటున్నారు చిత్ర‌యూనిట్. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన రంగ‌స్థ‌లం పాట‌లు ఆ రోజే పూర్తిస్థాయిలో మార్కెట్ లోకి రానున్నాయి. ఉగాది కానుక‌గా ప్రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక ఈ చిత్రంలోని రెండో పాట‌ను ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలోనే విడుద‌ల చేయ‌బోతున్నారు. రంగ‌మ్మో మంగ‌మ్మో అంటూ సాగే ఈ పాట‌లో అన‌సూయ చిందేసింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో అన‌సూయ ప్ర‌త్యేక గీతంతో పాటు కీల‌క పాత్ర‌లోనూ న‌టిస్తుంది. మార్చ్ 30న రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది.

User Comments