రంగ‌స్థ‌లం హైలైట్స్ ఇవే..

Last Updated on by

రామ్ చ‌ర‌ణ్ ఆశ‌లు.. సుకుమార్ ఏడాదిన్న‌ర క‌ష్టం.. ఇండ‌స్ట్రీ అంచ‌నాలు.. ఇవ‌న్నీ ఇప్పుడు రంగ‌స్థ‌లంపైనే ఉన్నాయి. ఇంకా ఒక్క‌రోజులోనే ఈ చిత్ర జాత‌కం బ‌య‌ట‌ప‌డ‌నుంది. మార్చ్ 30న భారీ స్థాయిలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. మార్చ్ 29 రాత్రి నుంచే ప్రీమియ‌ర్స్ కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే యుఎస్ లో 400 స్క్రీన్స్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది రంగ‌స్థ‌లం. రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో ఇదే హైయ్య‌స్ట్ రిలీజ్. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా 1200 స్క్రీన్స్ లో విడుద‌ల కానుంది రంగ‌స్థ‌లం. సాధార‌ణంగా ఓ స్టార్ హీరో సినిమాకు ఇవి తక్కువే.. కానీ పాత ప‌ద్ద‌తిలో వెళ్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. వ‌చ్చిన రెస్పాన్స్ ను బ‌ట్టి సినిమా థియేట‌ర్స్ పెంచాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే వ‌చ్చిన సెన్సార్ రిపోర్ట్ ను బ‌ట్టి సినిమా బాగుంద‌ని తెలుస్తుంది. అయితే నిడివి ఒక్క‌టే ఈ చిత్రానికి సమ‌స్య‌గా మారుతుంది. ఏకంగా 2 గంటల 56 నిమిషాలు ఉండ‌టంతో అంత సేపు ప్రేక్ష‌కులు ఎంగేజ్ అవుతారా అనేది అస‌లు అనుమానంగా మారిందిప్పుడు.Ram Charan Rangasthalam Highlights And Censor Talkఎంత ఆస‌క్తిక‌రంగా ఉన్నా కూడా ఎక్క‌డో ఓ చోట బోర్ ఫీల్ అవుతారు క‌దా అని చిన్న టెన్ష‌న్. 1980ల్లో గ్రామ రాజ‌కీయాలు ఎలా ఉండేవి అనే నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా ఇది. చ‌ర‌ణ్ కెరీర్ లోనే ది బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని తెలుస్తుంది. ఇక చెవిటివాడుగా ఆయ‌న ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్స్ క్లైమాక్స్ లో కంట‌త‌డి పెట్టిస్తాయ‌ని చెబుతున్నారు సెన్సార్ స‌భ్యులు. స‌మంత క్యారెక్ట‌ర్ కూడా బ‌లంగా రాసుకున్నాడు సుకుమార్. ఇక ఆది పినిశెట్టి.. ప్ర‌కాశ్ రాజ్.. జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌లు ఈ చిత్రానికి మూలం. మ‌న ద‌గ్గ‌రే కాదు.. దుబాయ్ లోనూ భారీగా విడుద‌ల‌వుతుంది ఈ చిత్రం. అక్క‌డ కూడా పిజి 13 అని సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. అంటే 13 ఏళ్ళు.. అంత‌కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌లు ఖచ్చితంగా పేరెంట్స్ గైడెన్స్ తోనే ఈ చిత్రం చూడాల‌ని అర్థం. అంటే మ‌న ద‌గ్గ‌ర యు బై ఏ అని అర్థం. ఇక్క‌డ కూడా అంతే క‌దా.. చిన్న‌పిల్ల‌లు పెద్దోళ్ల గైడెన్స్ లో ఈ చిత్రం చూడాలి. మ‌రి.. రంగ‌స్థ‌లం ఎలా ఉండ‌బోతుందో..? ఈ చిత్రంతో రామ్ చ‌ర‌ణ్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నాడో మరికొన్ని గంటల్లో తేలనుంది.

User Comments