రంగ‌స్థ‌లంకి ఇచ్చ‌ట అనుమ‌తి లేదు..!

Last Updated on by

అవును.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మ‌రో నాలుగు రోజుల్లో భారీగా వైజాగ్ లో రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. భారీగా అభిమానుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌ర‌గ‌నుంద‌ని తెలిపారు. వైజాగ్ వాసులు కూడా రంగ‌స్థ‌లం ఈవెంట్ కోసం ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. కానీ ఇలాంటి టైమ్ లో అనుకోని షాక్ త‌గ‌లుతుంది ఈ చిత్ర యూనిట్ కు. ఇప్ప‌టి వ‌ర‌కు వైజాగ్ ఈవెంట్ కోసం పోలీసుల అనుమ‌తి రాలేద‌ని తెలుస్తుంది. ఇదే ఇప్పుడు అంద‌రికీ షాకింగ్. వైజాగ్ లో మార్చ్ 18న ఉగాది సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ ఛ‌లో వైజాగ్ పేరుతో పోస్ట‌ర్స్ కూడా విడుద‌ల చేసారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు పోలీస్ ప‌ర్మిషన్ రాలేద‌ని తెలుసుకుని అభిమానులు ప‌రేషాన్ అవుతున్నారు. చిరంజీవి కుటుంబ మిత్రుడు.. తెలుగుదేశం మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావ్ ఉన్నా కూడా వైజాగ్ లో ప‌ర్మిష‌న్ రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. మ‌రో మూన్నాలుగు రోజులు టైమ్ ఉంది కాబ‌ట్టి అప్ప‌ట్లోగా అనుమ‌తి వ‌స్తుంద‌నే న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. గ‌తంలో ఖైదీ నెం.150 ఆడియో విడుద‌ల వేడుక స‌మ‌యంలో కూడా ప‌ర్మిష‌న్ కోసం చాలా తిప్ప‌లు ప‌డాల్సి వ‌చ్చింది చిరంజీవి. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. మ‌రి రంగ‌స్థ‌లం ఈవెంట్ కు ప‌ర్మిష‌న్  లభించేటట్లు కనిపించట్లేదు.!

User Comments