రంగ‌స్థ‌లం.. ఓ ప‌నైపోయింది బాబూ..!

Last Updated on by

ఒక‌టి రెండు కాదు.. ఏడాదిగా రంగ‌స్థ‌లం కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు రామ్ చ‌ర‌ణ్ అండ్ సుకుమార్. ఇన్నాళ్ల‌కు వాళ్ల క‌ష్టం చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. రంగ‌స్థ‌లం షూటింగ్ పూర్తైపోయింది. ఈ విష‌యాన్ని స‌మంత కూడా క‌న్ఫ‌ర్మ్ చేసింది. ఎట్ట‌కేల‌కు రంగ‌స్థ‌లం పూర్తైపోయిందంటూ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది స్యామ్. చివ‌రిరోజు ఆంజ‌నేయుడి విగ్ర‌హం ద‌గ్గ‌ర కొన్ని ప్ర‌త్యేక‌మైన సీన్స్ చిత్రీక‌రించాడు సుకుమార్. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్ లో వ‌చ్చేసాయి. చ‌ర‌ణ్ తో పాటు స‌మంత కూడా ఈ సీన్స్ లో ఉంది. రంగ‌స్థ‌లంలో చ‌ర‌ణ్ సౌండ్ ఇంజ‌నీర్ అదేనండీ చెవిటివాడి పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక స‌మంత పాత్ర కూడా ఇందులో చాలా కొత్త‌గా ఉంటుంద‌ని చెబుతున్నాడు సుకుమార్. రెగ్యుల‌ర్ గా క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ పాత్ర కాదిది. క‌చ్చితంగా ఈ చిత్రం చ‌ర‌ణ్.. స‌మంత‌కు కొత్త ఇమేజ్ తీసుకొస్తుందంటున్నాడు సుకుమార్. జ‌న‌వ‌రిలోనే షూటింగ్ పూర్తైనా కూడా కొన్ని సీన్స్ మళ్లీ రీ షూట్ చేసాడు సుకుమార్. అందుకే అనుకున్న దానికంటే కాస్త ఆల‌స్య‌మైంది ఈ చిత్ర షూటింగ్. ఇప్పుడు స‌మంత‌తో పాటు చ‌ర‌ణ్ కూడా రంగ‌స్థ‌లం నుంచి ఫ్రీ అయిపోయారు. ఫిబ్ర‌వ‌రి మూడో వారం నుంచి బోయ‌పాటి శీను సినిమా షూటింగ్ తో బిజీ కానున్నాడు రామ్ చ‌ర‌ణ్. మొత్తానికి రంగ‌స్థ‌లంతో బంధం తెంచేసుకున్నాడు చ‌ర‌ణ్. మ‌రి మార్చ్ 30న ఈ చిత్రం ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి..!

User Comments