రంగ‌స్థ‌లం బాగానే పలికింది

Last Updated on by

ఎప్ప‌ట్నుంచో క‌ల‌లు కంటోన్న ప్రాజెక్ట్ అయిపోయింది. ఏడాదిన్న‌ర‌గా సుకుమార్ చెక్కుతూనే రంగ‌స్థ‌లం అనే శిల్పం పూర్త‌యింది. ఇక దానికి రంగుల‌ద్ది.. మార్కెట్ లోకి పంప‌డ‌మే త‌రువాయి. అంటే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేయ‌డం అన్న‌మాట‌. హైద‌రాబాద్ లోనే రంగ‌స్థ‌లం షూటింగ్ కు గుమ్మ‌డికాయ్ కొట్టేసాడు ద‌ర్శ‌కుడు సుకుమార్. రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా నుంచి ఫ్రీ అయి కొన్ని రోజులు అయింది. ప్ర‌స్తుతం ఈయ‌న బోయ‌పాటి శీను సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ లో మార్చ్ 6 నుంచి జాయిన్ అవుతున్నాడు రామ్ చ‌ర‌ణ్. మ‌రోవైపు రంగ‌స్థ‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వేగంగా జ‌రుగుతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ 18న వైజాగ్ లో భారీగా రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌బోతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రంలోని రెండు పాట‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ చిత్ర ఆడియో రైట్స్ ఏకంగా కోటి 60 ల‌క్ష‌ల‌కు అమ్ముడ‌య్యాయి. నాన్ బాహుబ‌లిలో అజ్ఞాత‌వాసి 2 కోట్లు.. స్పైడ‌ర్ 2 కోట్ల‌కు అమ్ముడైతే.. ఇప్పుడు రంస‌గ్థ‌లం కోటిన్న‌ర‌కు పైగానే ప‌లికింది రేట్.

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రంగస్థ‌లంలో కొత్త కొత్త విష‌యాలు బ‌య‌టికి వ‌స్తున్నాయి. ఇందులో సీనియ‌ర్ ఎన్టీఆర్ కు సంబంధించిన స‌న్నివేశాలు ఉంటాయ‌ని తెలుస్తుంది. ఎందుకంటే క‌థ 80ల్లో సాగుతుంది కాబ‌ట్టి.. అప్ప‌టి రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ప్ర‌స్థావ‌న సినిమాలో వ‌స్తుంద‌ని తెలుస్తుంది. ఈ సీన్స్ అన్నీ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయంటున్నారు చిత్ర‌యూనిట్. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన రంగ‌స్థ‌లం పాట‌లు ఆ రోజే పూర్తిస్థాయిలో మార్కెట్ లోకి రానున్నాయి. ఉగాది కానుక‌గా ప్రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక ఈ చిత్రంలోని రంగ‌మ్మ మంగ‌మ్మ పాట త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ పాట‌లో అన‌సూయ చిందేసింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో అన‌సూయ ప్ర‌త్యేక గీతంతో పాటు కీల‌క పాత్ర‌లోనూ న‌టిస్తుంది. మార్చ్ 30న రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది.

User Comments