రంగ‌స్థ‌లం.. చాలా సర్ ప్రైజులు వెయిటింగ్..

రంగ‌స్థ‌లం.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్న సినిమా పేరు ఇది. దీనికి చాలా కార‌ణాలు ఉన్నాయి. అందులో మొద‌టికి ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ లుక్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. రామ్ చ‌ర‌ణ్ ఇందులో క‌నిపించిన తీరుకు అభిమానులతో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా సూప‌ర్ ఎగ్టైజ్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో చాలా స‌ర్ ప్రైజులు ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సుకుమార్. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ లో రామ్ చరణ్ కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది.

దానికి తోడు త‌ల‌పై మొక్క‌జొన్న పొత్తులు పెట్టుకుని వింత‌గా చూస్తూ మ‌రో స్టిల్ విడుద‌లైంది. ఇందులో చ‌ర‌ణ్ ను చూస్తే మ‌రోటి అర్థ‌మ‌వుతుంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఫిజిక‌ల్లీ ఛాలెంజెడ్ రోల్ లో క‌నిపిస్తున్నాడు. ఈ పాత్ర‌కు చెవుడు ఉంటుంది. పైగా మూగ కూడా. ఈ పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ ను చాలా చ‌క్క‌గా డిజైన్ చేసాడు సుకుమార్. మార్చ్ 30న రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది. క‌చ్చితంగా ఈ చిత్రం చ‌ర‌ణ్ కెరీర్ లో మైలురాయిగా మిగిలిపోతుంద‌ని భావిస్తున్నాడు సుకుమార్. అంతేకాదు.. ఈ చిత్ర క‌థపై ముందు అనాస‌క్తి చూపించిన చిరు.. ఇప్పుడు రంగ‌స్థ‌లం ఔట్ పుట్ చూసి థ్రిల్ అవుతున్నాడు. మొత్తానికి చ‌ర‌ణ్ ఏదో చేస్తున్నాడు.. అది తెలియాలంటే కొన్ని నెల‌లు వేచి చూడాల్సిందే..!