వావ్.. మంత్రిగారి వియ్యంకుడు స్టోరీతో చెర్రీ మూవీ

Ram Charan remake Chiranjeevis hit movie Mantri Gari Viyyankudu
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ‘రంగస్థలం 1985’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నట్లు ఇప్పటికే రామ్ చరణ్ ప్రకటించేశాడు. ఇక ఆ తర్వాత చెర్రీ చేయబోయే మరో ప్రాజెక్టుకు సంబంధించి కూడా రీసెంట్ గా వార్తలు బయటకు వచ్చాయి. ఈ మేరకు దిల్ రాజు నిర్మాణంలో త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రామ్ చరణ్ ఓ సినిమా చేసేలా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే సినిమా చూపిస్త మామ, నేను లోకల్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో పని చేయడానికి చెర్రీ కూడా ఆసక్తిగానే ఉన్నాడని తెలియడంతో.. ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ పట్టాలెక్కడం గ్యారెంటీ అనే టాక్ కొంచెం గట్టిగానే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు రావడం విశేషం. ఆ స్టోరీలోకి వెళితే, ఇప్పుడు చెర్రీతో సినిమా కోసం డైరెక్టర్ త్రినాథరావు నక్కిన.. మెగాస్టార్ చిరంజీవి ఒకనాటి సూపర్ హిట్ సినిమా ‘మంత్రిగారి వియ్యంకుడు’ నుంచి స్టోరీ లైన్ తీసుకున్నారట. అంటే, 1983 లో బాపు దర్శకత్వంలో చిరంజీవి నటించిన మంత్రిగారి వియ్యంకుడు సినిమాను బేస్ చేసుకునే త్రినాథరావు నక్కిన ఓ కథ తయారు చేస్తున్నారట.
అందులో భాగంగానే ఇప్పుడు తన అసిస్టెంట్స్ తో కలిసి దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నారని తాజా ఫిల్మ్ నగర్ టాక్. మొత్తంగా ఇప్పుడు అప్పటి మంత్రిగారి వియ్యంకుడు కథకు అప్డేట్ వెర్షన్ రెడీ చేస్తూ.. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దర్శక నిర్మాతలిద్దరూ దీనికి సంబంధించి కథను ఫైనలైజ్ చేసే పనిలో కూడా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే, స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాకే ఈ సినిమాపై తన ఫైనల్ డెసిషన్ చెబుతానని రామ్ చరణ్ ఆల్రెడీ ఓ మాట వదిలేశాడట. మరి ఆనాటి కాన్సెప్ట్ ను ఇప్పుడు కొత్త సీసాలో పోసి చెర్రీని ఎంతవరకు ఇంప్రెస్ చేస్తారో చూడాలి. ఒకవేళ అన్నీ అనుకున్నట్లే జరిగి ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం, మంత్రిగారి వియ్యంకుడుగా అప్పట్లో యూత్ ను మాస్ ను మెస్మరైజ్ చేసిన చిరును ఇప్పుడు చెర్రీ తలపిస్తాడేమో చూడాలి.