సుకుమార్ రుణం తీర్చుకోలేను

Last Updated on by

సుకుమార్ లేనిదే రంగ‌స్థ‌లం లేదు. రంగ‌స్థ‌లం లేనిదే చ‌ర‌ణ్ లేడు. అందుకే చెర్రీ 100రోజుల వేడుక‌లో ఎంతో ఎమోష‌న్ అయ్యారు. ఒక మ‌నిషి ఆలోచ‌న నుంచి పుట్టిన సినిమా ఇది. సుకుమార్‌ రైటింగ్ నుండి ఇది మొద‌లైంది. అత‌డి ఆలోచ‌న‌, మొండి బ‌లం ఈ సినిమా ప్రారంభం కావ‌డానికి కార‌ణం. సుక్కూ క‌ల ఈ స‌క్సెస్‌కి కారణం అన్నారు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌రణ్‌. రంగ‌స్థ‌లం శ‌త‌దినోత్స‌వ వేడుక‌లో చ‌ర‌ణ్ మాట్లాడుతూ పైవిధంగా స్ప ందించారు. రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ – “మా పంపిణీదారులు, థియేట‌ర్ య‌జ‌మానులు, నిర్మాత‌లు, సుకుమార్‌, ర‌త్న‌వేలు, దేవిశ్రీ అంద‌రికి థాంక్స్‌. 100 రోజుల విజ‌యం వెనుక ఎంత క‌ష్టం దాగి ఉందో మాకు తెలుసు. సుకుమార్ ఆలోచ‌న వ‌ల్లే నేను, ర‌త్న‌వేలు, దేవిశ్రీప్ర‌సాద్ స‌హా ఎందరో ప‌నిచేశాం. ద‌ర్శ‌కుడి ఆలోచ‌నా స్థాయి వంద రోజుల వ‌ర‌కు తీసుకొచ్చింది. అది ప‌వ‌ర్‌ఫుల్ ఆలోచ‌న‌. ఆ వ్య‌క్తికి నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. నేను ఎంత‌గానో అభిమానించే, ప్రేమించే నిర్మాత‌లు మైత్రీ నిర్మాత‌లు. ర‌త్న‌వేలుతో ఖైదీ నంబ‌ర్ 150 చిత్రానికి ప‌నిచేశాను. మ‌ళ్లీ ఈ సినిమాకు చేశాను. ర‌త్న‌వేలు ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డికీ ప‌నిచేస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ‌ పాట‌ల‌కు నా డాన్స్ మాస్ట‌ర్స్ ఎంతో క‌ష్ట‌ప‌డి నాతో డాన్స్ చేయించారు. అలాగే రంగ‌మత్త పాత్ర‌ను అన‌సూయ అందంగా చేశారు. స‌మంత‌, ప్రకాశ్‌రాజ్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు అంద‌రికీ థాంక్స్‌. త‌ల్లిదండ్రులు, గురువుల నుంచి నేర్చుకుంటాం. నేర్చుకుంటూనే ఉంటాం. నాన్న‌గారిని రీఎంట్రీ నుంచి ప‌రిశీలిస్తున్నాను. ఒక వ్య‌క్తికి ఇంత‌టి ఆద‌ర‌ణ‌, ప్రేమ ఎందుకు వ‌స్తాయి? అని ఆలోచించేవాడిని. గొప్ప పాత్ర వ‌ల్ల‌నో, మంచి సినిమా వ‌ల్ల‌నో ఆద‌ర‌ణ రాదు. ఎదిగేప్పుడు మ‌న‌తో పాటే ప‌దిమందిని పైకి తీసుకెళ్లాలి. ఎందుకంటే మ‌నం కింద‌ప‌డితే ఆ ప‌దిమందే కాపాడ‌తారు అని నాన్న‌గారు చెప్పేవారు. ప‌రిశ్ర‌మ‌ని కాపాడేవాళ్లు పంపిణీదారులు, ఎగ్జిబిట‌ర్లు. వాళ్లు సంతోషంగా ఉంటేనే మేం సంతోషంగా ఉంటాం. రంగ‌స్థ‌లంతోనే కాదు, ప్ర‌తి సినిమాకి వీళ్లు సంతోషంగా ఉండాలి.. అన్నారు.

User Comments