మెగా కోడలు ఫ్రెండ్ చాలా క్యూట్..!

ఉపాస‌న.. ఈ పేరు తెలియ‌ని వాళ్లు పెద్ద‌గా ఉండ‌రేమో..? కొణిదెల వారింటి కోడ‌లు.. అపోలో హాస్పిట‌ల్స్ వార‌సురాలు.. అన్నింటికి మించి రామ్ చ‌ర‌ణ్ భార్య‌.. ప్ర‌తీ విష‌యంలోనూ చ‌ర‌ణ్ కు తోడుగా ఉంటుంది ఉపాస‌న‌. చ‌ర‌ణ్ కు ఉన్న ఫాలోయింగ్ లో కాస్త ఉపాస‌నకు కూడా ఉంది. ఈమె కూడా సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ అప్ డేట్ గా ఉంటుంది. ఇక ఇప్పుడు త‌న బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో బ‌య‌ట‌పెట్టేసింది కొణిదెల కోడ‌లు.Ram Charan wife Upasana konidela best friend from mahesh family personరామ్ చ‌ర‌ణ్ భార్య కాక‌ముందే.. త‌న‌కంటూ బోలెడు పీఆర్ సంపాదించుకున్న అమ్మాయి ఉపాస‌న‌. మ‌రి ఈమె బెస్టీ ఎవ‌రో తెలుసా.. ఇండ‌స్ట్రీలోనే ఉన్నారు.. అది కూడా సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యామిలీ నుంచే ఉపాస‌న బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఇంకెవ‌రు మ‌హేష్ భార్య న‌మ్ర‌త అయ్యుంటుంది అనుకుంటున్నారా.. కాదు ఉపాస‌న బెస్ట్ ఫ్రెండ్ మ‌హేష్ కూతురు సితార‌. అవును.. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఇప్పుడు అదిరిపోయే పోజ్ ఇచ్చారు. చిన్నారి రాజ‌కుమారిలా సితార పోజ్ ఇస్తే.. ఉపాస‌న ఈ చిట్టిదాని ప‌క్క‌నే ఉండి న‌వ్వుతూ క‌నిపించింది. మొత్తానికి ఈ మెగా ఘ‌ట్ట‌మ‌నేని క‌ల‌యిక చూసి ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారిప్పుడు.