మెగా బావ‌ల్ని తొక్కేస్తున్న.. మెగా బామ్మ‌ర్దులు

Last Updated on by

బామ్మ‌ర్దులు బావ‌ల బ‌తుకు కోరతారంటారు. కాక‌పోతే ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ లో జ‌రుగుతుంది. మెగా హీరోలే ఇది చేస్తున్నారు. ఇక్క‌డ బామ్మ‌ర్దుల బాగు కోరుతున్నారు బావ‌లు. త‌మ సినిమాల‌తో బావ‌ల‌ను పూర్తిగా డామినేట్ చేస్తున్నారు బామ్మ‌ర్దులు. వాళ్ళెవరో ఈ పాటికే అర్థ‌మ‌య్యుంటుంది క‌దా..! ఒక‌రు రామ్ చ‌ర‌ణ్-అల్లుఅర్జున్.. మ‌రొక‌రు వ‌రుణ్ తేజ్-సాయిధ‌రంతేజ్. వీళ్లంతా బావ‌లు బామ్మ‌ర్దులే. ప్ర‌స్తుతానికి ఇక్క‌డ బావ మ‌రుదుల డామినేష‌న్ న‌డుస్తుంది. మొన్న‌టికి మొన్న తొలిప్రేమ‌, ఇంటిలిజెంట్ ఒకేసారి విడుద‌ల‌య్యాయి. ఇందులో బావ సాయిధ‌రంతేజ్ న‌టించిన సినిమా డిజాస్ట‌ర్ అయింది.. అదే స‌మ‌యంలో బామ్మ‌ర్ది త‌న తొలిప్రేమ‌తో బావ‌ను పూర్తిగా ముంచేసాడు. వ‌రుణ్ తేజ్ న‌టించిన ఈ సినిమా ఇప్ప‌టికే ఐదు రోజుల్లో 17 కోట్ల షేర్ వ‌సూలు చేసింది.

ఇక చ‌ర‌ణ్ కూడా త‌న బావ బ‌న్నీని డామినేట్ చేసాడు. అది పాట విష‌యంలో. అవును.. ఫిబ్ర‌వ‌రి 13న రంగ‌స్థ‌లం సినిమాలోని తొలిపాట విడుద‌లైంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌రిచి పాడిన ఈ పాట‌కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌స్తుంది. స్లోగా సాగే ఈ బీట్ విని అంతా ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా చంద్ర‌బోస్ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక ల‌వ‌ర్స్ డే కానుక‌గా బ‌న్నీ న‌టిస్తోన్న నా పేరు సూర్య నా యిల్లు ఇండియాలోని రెండో పాట విడుద‌లైంది. సైనికా పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కానీ రెండో పాట‌కు మాత్రం ఊహించిన రెస్పాన్స్ రావ‌డం లేదు. విశాల్ శేఖ‌ర్ సంగీతం అందించిన ఈ పాట ఎందుకో కానీ రంగ‌స్థ‌లం రేంజ్ లో హిట్ కాలేదు. అను ఎమ్మాన్యువ‌ల్ తో క‌లిసి ఈ పాట‌లో బ‌న్నీ రొమాన్స్ చేసాడు. ఇక అక్క‌డ స‌మంత‌తో చ‌ర‌ణ్ పాట పాడుకున్నాడు. ఈ రెండు పాట‌ల‌ను ప‌క్క‌న‌బెట్టి చూస్తే బావ‌ను పూర్తిగా త‌న పాట‌తో ప‌క్క‌న‌బెట్టేసాడు బామ్మ‌ర్ది. మొత్తానికి ఇప్పుడు మెగా బావ బామ్మ‌ర్దుల మంచి పోటీ న‌డుస్తుంది.

User Comments