అబ్బాయిని టార్గెట్ చేసిన బాబాయ్..

ఈ రోజుల్లో ఫ్యామిలీ పోరు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాగానే జ‌రుగుతుంది. రెండేళ్ల కింద నంద‌మూరి హీరోలు ఒకేసారి వ‌చ్చారు. ఇక ఇప్పుడు మెగా హీరోల‌కు కూడా ఇదే ప‌రిస్థితి వ‌స్తుందేమో అని ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు ప్రేక్ష‌కులు. సంక్రాంతికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు రామ్ చ‌రణ్ కూడా వ‌స్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ మాత్రం రావ‌ట్లేదు. రంగ‌స్థ‌లం 1985 షూటింగ్ అనుకున్న‌ట్లుగానే వేగంగా జ‌రుగుతుంది. న‌వంబ‌ర్ చివ‌రి నాటికి ఈ చిత్ర టాకీ పూర్తి కానుంది. షూటింగ్ పూర్తైనా కూడా సినిమా సంక్రాంతికి వ‌స్తుందా రాదా అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. దానికి కార‌ణం సంక్రాంతికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వ‌స్తుండ‌టమే. త్రివిక్ర‌మ్ సినిమా జ‌న‌వ‌రి 10న రానున్న‌ట్లు అనౌన్స్ చేసారు. చూస్తూ చూస్తూ బాబాయ్ సినిమాకు పోటీగా చ‌ర‌ణ్ వ‌స్తాడా అనే ఆస‌క్తి ఉంది. కానీ రంగ‌స్థ‌లం మాత్రం క‌చ్చితంగా సంక్రాంతికే వ‌స్తుంద‌ని చెబుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రోవైపు చ‌ర‌ణ్ మాత్రం తాను బాబాయ్ తో పోటీ ప‌డ‌బోన‌ని క్లారిటీ ఇస్తున్నాడు. మ‌హేశ్ భ‌ర‌త్ అను నేను కూడా సంక్రాంతి రేస్ నుంచి ప‌క్క‌కు త‌ప్పుకుంది. అయినా గానీ ప‌వ‌న్ తో పోటీకి నో అంటున్నాడు రామ్ చ‌ర‌ణ్.

షూటింగ్ పూర్తైనా కూడా.. బాబాయ్ కోసం త్యాగం త‌ప్పేలా లేదు. నిజం చెప్పాలంటే ఇప్ప‌టి వ‌ర‌కు సుకుమార్ కెరీర్ లో ఆర్య త‌ప్ప మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ లేదు. 100 ప‌ర్సెంట్ ల‌వ్ హిట్.. నాన్న‌కు ప్రేమ‌తో యావ‌రేజ్. కానీ ఈ ద‌ర్శ‌కుడి టేకింగ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతెందుకు రాజ‌మౌళి కూడా సుకుమార్ స్టైల్ ఇష్ట‌ప‌డ‌తాడు. అలాంటి ద‌ర్శ‌కుడు ఇప్పుడు త‌న దారి మార్చుకుని రామ్ చ‌ర‌ణ్ తో రంగ‌స్థ‌లం సినిమా చేస్తున్నాడు. ముప్పై ఏళ్ల కింద జ‌రిగే క‌థ ఇది. 1985 అని క్యాప్ష‌న్ కూడా పెట్టాడు సుకుమార్. ఈ చిత్రం గురించి అంతా ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. త‌న సినిమాల గురించి పెద్ద‌గా మాట్లాడ‌ని సుకుమార్ సైతం రంగ‌స్థ‌లం అదిరిపోతుందంటున్నాడు. ఇందులో కొత్త రామ్ చ‌ర‌ణ్ ను చూస్తారంటూ ఊరిస్తున్నాడు. ఇక చ‌ర‌ణ్ కూడా త‌న మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన స‌బ్జెక్ట్ ఇది అంటున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత క‌చ్చితంగా న‌టుడిగా తాను మ‌రో మెట్టు పైకి ఎక్కుతాన‌నే న‌మ్మ‌కం ఉంది అంటున్నాడు చ‌ర‌ణ్. మ‌రి చూడాలిక‌.. రంగ‌స్థ‌లం అయోమ‌యం ఎప్ప‌టికి తీరుతుందో..?