నైజాం రికార్డ్స్ చరణ్ సొంతం

రంగ‌స్థ‌లం రోజుకో రికార్డు దాటేస్తూ ముందుకెళ్తుంది. ఇప్పుడు మ‌రో రికార్డు కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు సిట్టిబాబు. ఈ చిత్రం 17 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 106 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 78 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి నెంబ‌ర్ వ‌న్ హిట్ గా అవ‌త‌రించింది. ఈ లిస్ట్ లో బాహుబ‌లి మిన‌హాయింపు. ఖైదీ నెం.150 రికార్డుల‌ను సైతం ఈ చిత్రం దాటేసింది. ఇక ఇప్పుడు మ‌రో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది రంగ‌స్థ‌లం. నైజాంలో ఈ చిత్రం 23 కోట్ల మార్క్ దాటేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో బాహుబ‌లి కాకుండా అత్తారింటికి దారేది మాత్ర‌మే ఈ రికార్డును అందుకుంది.

ఇప్పుడు మ‌ళ్లీ ఐదేళ్ల తర్వాత అబ్బాయి వ‌చ్చి ఆ రికార్డుల‌ను క‌దిలించాడు. మ‌ధ్య‌లో ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా అత్తారింటిని మాత్రం అస‌లు ట‌చ్ చేయ‌లేక‌పోయాయి. చివ‌రికి చిరంజీవి వ‌చ్చినా కూడా చూస్తుండిపోయాడే కానీ త‌మ్మున్ని క‌ద‌ప‌లేక‌పోయాడు. కానీ ఇప్పుడు అబ్బాయి వ‌చ్చి ర‌చ్చ‌ర‌చ్చ చేసాడు. సింపుల్ గా బాబాయ్ ను ప‌క్క‌కు జ‌రిపేసి తాను అగ్ర‌తాంబూలం తీసుకున్నాడు. నైజాంలో రంగ‌స్థ‌లం 24 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే 25 కోట్ల మార్క్ అందుకునేలాగే క‌నిపిస్తుంది. నైజాంలో ఇప్ప‌టికే మ‌గ‌ధీర‌తో 22 కోట్ల మార్క్ అందుకున్న చ‌ర‌ణ్.. ఇప్పుడు రంగ‌స్థ‌లంతో దాన్ని మించిపోయాడు. మొత్తానికి ఫుల్ ర‌న్ అయ్యేస‌రికి సిట్టి బాబు ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తాడో..?

User Comments