రంగ‌స్థ‌లం ఫైన‌ల్ గ తెచ్చింది ఎంతో తెలుసా..?

Last Updated on by

ఈ స‌మ్మ‌ర్ లోనే కాదు.. చూస్తుంటే ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవ‌కాశాలు రంగ‌స్థ‌లంకే ఎక్కువగా క‌నిపిస్తున్నాయి. మార్చ్ 30న విడుద‌లైన ఈ చిత్రం ఫుల్ ర‌న్ లో 123 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. గ్రాస్ అయితే 216 కోట్ల‌కు పైగానే ఉంది. తెలుగులో బాహుబ‌లి కాకుండా ఈ రికార్డ్ అందుకున్న ఏకైక సినిమా ఇదే. 50 రోజుల పాటు ఈ చిత్రం థియేట‌ర్స్ లో ఉంది. ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ ఇది. నైజాంలో 18 కోట్ల‌కు కొంటే 27 కోట్ల‌కు పైగా ఈ చిత్రం వ‌సూలు చేసింది.

ఇక ఓవ‌ర్సీస్ లోనూ 9 కోట్ల‌కు కొంటే 14 కోట్ల‌కు పైగానే వ‌చ్చాయి. దానికితోడు క‌ర్ణాట‌క‌లో 10 కోట్లు.. త‌మిళనాడులో 3 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసాడు సిట్టిబాబు. కొన్న ప్ర‌తీ ఏరియాలోనూ బ‌య్య‌ర్ల‌కు లాభాల పంట పండించాడు. అన్ని చోట్లా క‌లిపి ఈ చిత్రం 123 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 62 కోట్ల‌కు బిజినెస్ చేస్తే 93 కోట్లు తీసుకొచ్చింది. ఇక మిగిలిన అన్ని చోట్లా క‌లిపి మ‌రో 30 కోట్లు తీసుకొచ్చింది రంగ‌స్థ‌లం. మొత్తానికి సుకుమార్ కెరీర్ లోనే కాదు.. రామ్ చ‌రణ్ కెరీర్ లో కూడా రంగ‌స్థ‌లం ఓ రికార్డ్. మొత్తానికి వేరే హీరోలకు ఈ చిత్ర రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి చాలా కాలం ప‌ట్టేలా ఉంది.

User Comments