క‌థ‌ల విష‌యంలో హీరో బెంబేలు

Last Updated on by

హీరో రామ్ క‌థ‌ల విష‌యంలో కాస్తంత బెంగగా ఉన్నాడా? త‌న‌వైపు వ‌చ్చే క‌థ‌ల్లో వేటిని ఎంపిక చేసుకోవాలో తెలీని క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్నాడా? అంటే అవున‌నే అత‌డిని చూస్తే అర్థ‌మ‌వుతోంది. రామ్ స్వ‌యంగా ఇచ్చిన హింటును ప‌రిశీలిస్తే.. స‌రైన క‌థ‌ల్ని ఎంచుకోవాలంటే ఎంత త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డాల్సి ఉంటుందో అర్థ‌మ‌వుతోంది. ప‌దుల సంఖ్య‌లో క‌థ‌లు వ‌స్తుంటాయి. అన్నిటినీ ప‌రిశీలిస్తాను. మంచి స్క్రిప్టు వ‌స్తే ఎందుకు న‌టించ‌ను? కొంద‌రు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సిఫార‌సు చేసే స్క్రిప్టులు వినాల్సి ఉంటుంది. అయితే వాటిలో ఏది నాకు సూట‌వుతుందో నాకే తెలియాలి. రంగ‌స్థ‌లం, ఆర్‌.ఎక్స్ 100 లాంటి ప్ర‌యోగాత్మ‌క క‌థ‌లు వ‌చ్చినా చేస్తాను. మహాన‌టి లాంటి సినిమాలు నా వైపు వ‌చ్చినా చేసేవాడిని. ఏదైనా నాకు సూట‌వ్వాలి.. క‌థ క‌నెక్ట‌వ్వాలి… అనీ అన్నారు.

గ‌త చిత్రాల ప‌రాజ‌యాల్ని విశ్లేషించుకున్న రామ్ .. ఓ మాట అన్నారు. నేను న‌టించే ల‌వ్‌స్టోరీస్‌లో నేను శైల‌జ‌, జ‌గ‌డం, రెడీ చిత్రాల‌న్నీ ప్రేమ‌క‌థ‌ల‌తో తెర‌కెక్కిన‌వే. అయితే హిట్టొస్తే ఆ సినిమాకి, ఆ క‌థ‌కు ఇంపార్టెన్స్ క‌నిపిస్తోంది. గుర్తింపు ద‌క్కుతోంది. జ‌గ‌డం ఫ్లాపైంది కాబ‌ట్టి దానికి గుర్తింపు రాలేదు.. అని రామ్ అన్నారు. జ‌గ‌డం అప్ప‌ట్లోనే అడ్వాన్స్‌డ్ స్టోరితో వ‌చ్చిన సినిమా కాబ‌ట్టి ఫ‌లితం తేడా కొట్టింద‌ని అంగీక‌రించారు. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు ప్రేమ‌క‌థ‌లు ఎక్కువ స‌క్సెస్‌వుతున్నాయి కాబ‌ట్టే ఆ త‌ర‌హా సినిమాలు చేస్తున్నార‌ని రామ్ అన్నారు.

రొటీన్ క‌థ‌ల‌తో సినిమా తీసినా ఎత్తుగ‌డ కొత్త‌గా ఉంటే, జ‌నాల‌కు కనెక్ట‌యితే సినిమాలు చూస్తున్నారు. అర‌వింద సమేత తండ్రి – కొడుకుల ఎమోష‌న్, రివెంజ్ డ్రామాపై తీసిన పాత క‌థే. అయితే చెప్పిన విధానం జ‌నాల‌కు న‌చ్చింది. క‌నెక్ట‌యి పెద్ద హిట్ట‌యింది. `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే` చిత్రంలో ఒకే ఒక్క నావ‌ల్ పాయింట్ క‌థ‌ను డ్రైవ్ చేస్తుంది. ద్వితీయార్థంలో వ‌చ్చే ఆ పాయింట్ అంద‌రికీ న‌చ్చుతుంది. ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగే చిత్ర‌మిది. ఇందులో నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో నటించాను. ఒక గ్రామం నుంచి సిటీ కి వస్తాను. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఇంతవరకు ఎవరు స్ప‌ర్శించ‌ని ఓ పాయింట్ ఈ సినిమాలో ఉంది. అదేంటో తెర‌పై చూడండి అనీ అన్నారు. `రామ రామ కృష్ణ కృష్ణ` తరువాత ఎన్నో క‌థ‌లు అనుకున్నాం కానీ దిల్‌రాజుగారితో కుద‌ర‌లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో కుదిరింది.. అని తెలిపారు. హ‌లో గురు ప్రేమ‌కోస‌మే ఈనెల 18న ద‌స‌రా కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments