ఛీఛీ.. వ‌ర్మ మ‌రీ ఇంత బూతా..?

రామ్ గోపాల్ వ‌ర్మను కెలికితే బుర‌ద‌లో రాయి కాదు.. ఏకంగా మ‌న మొహ‌మే తీసుకెళ్లి బుర‌ద‌లో పెట్టిన‌ట్లు. అలా ఉంటాయి ఆయ‌న ఆలోచ‌న‌లు. ప్ర‌పంచంతో ఆయ‌న‌కు ప‌నిలేదు. తాను ఈ ప‌ని చేస్తే ఎవ‌రైనా ఏమైనా అనుకుంటారా అనే ధ్యాస లేదు. ఎవ‌రేం అనుకుంటే నాకేంటి.. నేనింతే అనే ఆలోచ‌న‌లో బ‌తికేస్తుంటాడు వ‌ర్మ‌. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. ఈయ‌న చేసిన ఓ చెండాల‌మైన ప‌నికి ట్విట్ట‌ర్ వేదికైంది. బాబుగారు ముంబైలో ఆఫీస‌ర్ షూటింగ్ పూర్తిచేసి.. అమ్మాయిల‌తో క‌లిసి పార్టీ చేసుకుని ఇంటికి వెళ్లి తన పైత్యాన్ని చూపించారు. మాట‌ల్లో కూడా చెప్ప‌లేని విధంగా ఓ నీచ‌మైన ఫోటోను ట్వీట్ చేసి.. దానిపై వికృత‌మైన చ‌ర్య‌ను పోస్ట్ చేసారు. ఇది చూసిన త‌ర్వాత వ‌ర్మ‌ను ఏమ‌నాలో కూడా అర్థం కావ‌ట్లేదు. ప్ర‌పంచం మొత్తం మీద జ‌రిగే తంతే క‌దా.. దీనికి సిగ్గెందుకు అన్న‌ట్లుగా ఉంది వ‌ర్మ‌గారి చేష్ట‌లు చూస్తుంటే. పండు తొన‌లు తీసి.. దానిపై చేయి వేసి వ‌ర్మ‌గారు ఇచ్చిన పోజు చూసి అమ్మాయిలైతే బండ‌బూతులు తిడుతున్నారు. మత్తు దిగిన తర్వాత ట్వీట్ ను తొలగించాడు.Ram Gopal Varma Feeling Alone Need a Lady Company
మొన్న‌టికి మొన్న శ్రీదేవి విష‌యంలో మ‌న‌సు క‌రిగిపోయే లేఖ రాసి త‌న‌లో కూడా అద్భుత‌మైన మ‌నిషి ఉన్నాడ‌ని నిరూపించుకున్న వ‌ర్మ‌.. ఇప్పుడు మ‌ళ్లీ పాత మ‌నిషిని నిద్ర లేపాడు. అస‌లే భార్య చెంత‌న లేదు క‌దా.. సో సారీ.. భార్య‌తో ఈయ‌న‌కు అవ‌స‌రం లేదు క‌దా.. అందుకే ఇలాంటి సిగ్గు లేని ప‌నులు చేస్తూ ఉన్నాడు వ‌ర్మ‌. ఎంత హ‌ద్దు మీరితే అంత మేధావి అని కీర్తిస్తార‌ని అనుకుంటున్నాడేమో మ‌రి వ‌ర్మ‌..? అందుకే ఇలాంటి ప‌నులు చేస్తున్నాడేమో..? అన్న‌ట్లు బ‌య‌ట ఎలాంటి ప‌నులు చేసినా సినిమాల విష‌యానికి వ‌చ్చేస‌రికి ఈయ‌న జీనియ‌స్. నాగార్జున‌తో ఈయ‌న క‌మిటైన ఆఫీస‌ర్ సినిమాను అనుకున్న దానికంటే 15 రోజుల ముందే పూర్తిచేసి ఔరా అనిపించాడు ఈ ద‌ర్శ‌కుడు. అంత‌లోనే ఇలాంటి చిలిపిప‌ని చేసి తిట్లు తింటున్నాడు. ఏదేమైనా అన్నీ వ‌ర్మ‌కే సాధ్యం..!