వామ్మో.. వర్మ సెక్స్ ట్రూత్ బాబోయ్..!

Last Updated on by

వర్మను ఊరికే మేధావి అనలేదు. ఆయన కొన్ని పిచ్చి సినిమాలు తీస్తాడేమో.. కానీ ఆయన తీసే ప్రతీ సినిమా వెనక ఆయనకో థియరీ ఉంటుంది. ఎవరు ఎక్కడ్నుంచి ఎలాంటి ప్రశ్నతో అయినా దాడి చేయని.. ఆయన దగ్గర దానికి పర్ ఫెక్ట్ సమాధానం ఉంటుంది. తాజాగా ఆయన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అనే పోర్న్ షార్ట్ ఫిల్మ్ చేసాడు. ఇదే సినిమా మరేదైనా దర్శకుడు తీయడానికి కాదు.. కనీసం ఆలోచించడానికి కూడా భయపడతాడు. కానీ వర్మ చేసాడు. యూరప్ వెళ్లి మరీ ఈ షార్ట్ ఫిల్మ్ షూట్ చేసుకుని వచ్చాడు. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత వచ్చిన రచ్చను చూపిస్తూ ఓ ఛానెల్ చర్చకు తెరలేపింది. ఇందులో పాల్గొన్న వర్మ.. అక్కడి అమ్మాయిలు అడిగిన ప్రశ్నలకు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానాలు చెప్పాడు. అంతా యంగ్ అమ్మాయిలే వచ్చిన ఆ కార్యక్రమంలో సెక్స్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడి ఆశ్చర్యపరిచాడు వర్మ. దానికి తోడు అమ్మాయిలు కూడా వర్మను చూడగానే ఉత్సాహంతో మనసులో ఉన్న అనుమానాలన్నీ అడిగేసారు.
పోర్న్స్టార్తో విదేశాల్లో ఎందుకు తీశారు.. ? ఇండియాలో ఇలాంటి సినిమాకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదా అంటూ ఓ అమ్మాయి అడిగిన ప్రశ్నకు వర్మ తనదైన రీతిలో సమాధానం చెప్పాడు. ఇండియాలో నగ్నంగా నటించడానికి ఎవరూ ఒప్పుకోరు. పోర్న్ స్టార్ అయితే నేను అనుకున్నది తీయగలను అనే ఉద్దేశ్యంతో మియా మాల్కోవాను తీసుకోవడం జరిగింది. అదీ గాక ఇండియాలో ఇలాంటి సీన్లు తీయడానికి చట్టం ఒప్పుకోదు. అందుకే యూరప్ వెళ్లి తీసుకొని వచ్చానని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. మరి అక్కడ షూట్ చేసి ఇక్కడ చూపించొచ్చా అంటే దానికి తెలివైన సమాధానమిచ్చాడు ఈ దర్శకుడు. తాను తన ఫిల్మ్ డిజిటల్ వరల్డ్ లో.. ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్లకు మాత్రమే చూపిస్తానని చెప్పాడు వర్మ. ఇలాంటి సినిమాలు చూసి నేరాలు జరిగితే ఏంటి పరిస్థితి అంటే.. మన దేశంలో హింస, సెక్స్ అనేవి కొన్ని వందల ఏళ్లుగా ఉన్నాయి. అలాగని అంతా అదే చేస్తూ ఉండటం లేదు కదా..! పైగా సినిమా వచ్చి 100 ఏళ్లు అయింది.. పోర్న్ వచ్చి పదేళ్లు కూడా కాలేదు.. క్రైమ్ చేసేవాడు ఎలాగైనా చేస్తాడు.. వాడికి సినిమాలతో పనిలేదన్నాడు.

ఈ సినిమా టైమ్ లో మియా మాల్కోవాతో సెక్స్ చేశారా.. అని ఓ అమ్మాయి నేరుగా వర్మను ప్రశ్న అడిగేసింది. దానికి సమాధానం ఇస్తూ అది నా పర్సనల్ విషయం.. కానీ ఈ ప్రశ్న నాకు నచ్చిందంటూ అందులోనూ చమత్కారం చూపించాడు వర్మ. సెక్స్ కోసం ఎప్పుడైనా ఎవరి కాళ్లైనా పట్టుకున్నారా అంటూ మరో అమ్మాయి ప్రశ్న అడిగితే ఎప్పుడూ తాను అలా చేయలేదు.. అవసరం కూడా రాలేదని చెప్పాడు వర్మ. మొత్తానికి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ షార్ట్ ఫిల్మ్ కంటే ఈ కార్యక్రమమే ఎక్కువ వేడి పుట్టించింది. అన్నట్లు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కత్తిమహేశ్.. ఫస్ట్ టైమ్ ఓ పప్పులా కనిపించాడు. ఏం చెప్పాలో తెలియక వర్మను అలా చూస్తుండిపోయాడు. దాన్ని బట్టి ఈయన రేంజ్ ఏంటి.. వర్మ రేంజ్ ఏంటి అనే విషయం మరోసారి అందరికీ అర్థమైంది. ఎప్పుడూ ఏదో ఓ విషయాన్ని హైలైట్ చేస్తూ కత్తిని హైలైట్ చేయాలనుకునే ఛానెల్ కు ఇది కనువిప్పు అవుతుందో లేదో పాపం..!

Follow US 

User Comments