వర్మ మాట నిలబెట్టుకొంటాడా?

Last Updated on by

శ్రీ‌దేవి అంటే వ‌ర్మ‌కు ఎంత పిచ్చో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమెతో చేసిన సినిమాల్లో హీరోల‌ను కూడా ప‌ట్టించుకోలేదు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అంత అభిమానం ఆమె అంటే. ఎప్పుడు స్ట్రెస్ గా ఫీల్ అయినా కూడా శ్రీ‌దేవి పాట‌ల‌తో మైండ్ రిలీఫ్ చేసుకుంటాడు ఈ ద‌ర్శ‌కుడు. అలాంటి వ‌ర్మ‌కు ఇప్పుడు దేవుడు సూప‌ర్ షాక్ ఇచ్చాడు. శ్రీ‌దేవిని తీసుకెళ్లి త‌న‌ను ఒంటిరివాన్ని చేసాడంటూ దేవున్నే తిట్టేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ బాధ‌లో ఉన్నప్పుడు షూటింగ్ చేసే మూడ్ కూడా ఈ ద‌ర్శ‌కుడికి లేదు. అందుకే నాగార్జున సినిమాను ప్ర‌స్తుతానికి ఆపేసాడు వ‌ర్మ‌. ముంబైలోనే ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. మార్చ్ 30 వ‌ర‌కు అక్క‌డే షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు.

నిజానికి ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఫిబ్ర‌వ‌రి 25 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే రిలీజ్ కావాలి. కానీ శ్రీ‌దేవి చ‌నిపోవ‌డంతో త‌న ఫ‌స్ట్ లుక్ ను పోస్ట్ పోన్ చేసి ఫిబ్ర‌వ‌రి 27 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేసాడు వ‌ర్మ‌. ఆఫీసర్ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టాడు కానీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూస్తే అంత పెద్ద కిక్ అయితే ఇవ్వట్లేదు. మరి వర్మ.. శ్రీదేవి ధ్యాసలో పడి నాగార్జునకి పెద్ద హిట్ ఇస్త అని ఇచ్చిన మాట మర్చిపోవట్లేదు కదా..?

User Comments