పోకిరి ఫ్లాప్ అన్న వర్మ.. పూరీ థ్యాంక్స్..

Last Updated on by

అదేంటి.. తెలుగు ఇండ‌స్ట్రీ రికార్డుల‌న్నీ తిర‌గ‌రాసి.. కొత్త మార్కెట్ సెట్ చేసిన పోకిరి సినిమా ఫ్లాప్ ఎందుకు అవుతుంది..? అస‌లు వ‌ర్మ‌కు బుర్ర‌గానీ పోయిందా.. లేదంటే ఓడ్కా గానీ ఎక్కువైందా అనుకుంటున్నారా..? అవేం కాదు.. ఇప్పుడు వ‌ర్మ‌కు పూరీ పిచ్చి ప‌ట్టుకుంది. ఒక‌ర్ని పొగ‌డాలంటే మ‌రొక‌ర్ని తిట్టాల‌నే సెటైరిక‌ల్ మ‌న‌స్త‌త్వం వ‌ర్మ సొంతం. ఏ సినిమానైనా పొగ‌డాలంటే.. ఎవ‌రెస్ట్ లాంటి సినిమాను దాని ముందు దించేస్తాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. పూరీ ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న మెహ‌బూబా సినిమా క్లిప్స్ కొన్ని చూసాడు వ‌ర్మ‌. పూరీ త‌న‌యుడు ఆకాశ్ పూరి ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే సగానికి పైగా పూర్త‌యింది.

ఇందులో కొన్ని సీన్స్ చూసి వెంట‌నే ఆ సినిమా అప్ డేట్స్ ట్విట్ట‌ర్ లో పెట్టేసాడు వ‌ర్మ‌. ఇప్పుడే మెహ‌బూబాలోని కొన్ని సీన్స్ చూసాను.. ఇది చూసిన త‌ర్వాత పోకిరి సినిమా ఫ్లాప్ అని ఇప్పుడే అర్థ‌మైంది.. విజువ‌ల్స్ స్ట‌న్నింగ్ అంటూ ఎఫ్ తో మొద‌ల‌య్యే త‌న అల‌వాటైన ప‌దాన్ని కూడా ట్వీట్ చేసాడు వ‌ర్మ‌. అయితే ఓ సినిమాను ఇంత‌గా పొగ‌డ‌టం వ‌ర్మ‌కు అలవాటే. గ‌తంలో పైసావ‌సూల్ చూసి కూడా ఇలాగే అన్నాడు కానీ ఆ సినిమా ఏమైందో అంద‌రికి తెలుసు. ఇప్పుడు పూరీ త‌న‌యుడి కోసం పోకిరిని త‌క్కువ చేస్తున్నాడు. ఇది చూసి మ‌హేశ్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. పూరీని పొగిడే క్రమంలో త‌మ హీరో సినిమాని ఎందుకు త‌క్కువ చేస్తున్నారంటున్నారు వాళ్లు. అయినా వాళ్ల పిచ్చి గానీ ఇవ‌న్నీ వ‌ర్మ ప‌ట్టించుకుంటాడా..?

Follow US 

User Comments