`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ బాధ్య‌త‌ బాబుగారిదే

సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` 29న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించి సెన్సార్ రిపోర్ట్ ఇంకా రాలేదు. అభ్యంత‌ర‌క స‌న్నివేశాలుంటే ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ రిలీజ్ వాయిదా వేసే అవ‌కాశం ఉంద‌ని సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. అటు చంద్ర‌బాబు నాయుడు పొలిటిక‌ల్ కెరీర్ కు సినిమా డ్యామేజ్ చేస్తుంద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నేడు రాంగోపాల్ ఇచ్చిన ఓ ఇంట‌ర్వూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఆ వేంటో ఆయ‌న మాట‌ల్లోనే!

నేను ఎవ‌రి స‌ల‌హాలు తీసుకోను. న్యా,యం, ప్ర‌జాస్వామ్యం, కోణంలో ఆలోచించి అన్ని విష‌యాల్ని అర్ధం చేసుకుని సినిమా తీశా. సినిమా ఆపాల‌ని కోర్టులో కేసు వేయ‌డం, ద‌గా పాట‌ని యూ ట్యూబ్ నుంచి తొల‌గించ‌డం మిన‌హా మిగ‌తా హెచ్చ‌రిక‌ల‌న్నీ చాలా సిల్లీగా అనిపించాయి. ప్ర‌జాస్వామ్య దేశంలో నివ‌సిస్తున్నాం. సినిమా ఆప‌డం ఎవ‌రి వ‌ల్ల కాదు. ఆ విష‌యంలో నేను నాక‌న్నా ఎక్కువ‌గా న‌మ్మేది చంద్ర‌బాబు నాయుడినే. ఆయ‌న రాష్ర్టానికి ముఖ్య‌మంత్రి. శాంతి భ‌ద్ర‌త‌ల్ని కాపాడి, రాజ్యంగా హ‌క్కుల్ని ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త‌ ఆయ‌న‌పైనే ఉంది. ఆయ‌నే ద‌గ్గ‌రుండి ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని విడుద‌ల చేయిస్తార‌ని నా ప్ర‌గాఢ న‌మ్మ‌కం అని అన్నారు.

Also Read: Ntr First Look In Rgv Lakshmi’s NTR