వైర‌స్ ఎక్కిస్తున్న వ‌ర్మ‌..

Last Updated on by

ఇప్ప‌టికే ఇండియ‌న్ సినిమాకు త‌న వంతు కృషి ఎంతో చేసాడు వ‌ర్మ‌. ఆయ‌న నుంచి నేర్చుకుని ఎందరో ద‌ర్శ‌కులు అయ్యారు. ఇక ఇప్పుడు త‌న వంతుగా వైర‌స్ ఎక్కించ‌డానికి రెడీ అవుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అదేంటి అనుకుంటున్నారా..? ఈ మ‌ధ్యే ఆఫీస‌ర్ తో రికార్డ్ రేంజ్ లో డిజాస్ట‌ర్ ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు అప్పుడే త‌ర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు. తెలుగులో ఇప్పుడు డిజాస్ట‌ర్ ఇచ్చాడు క‌దా.. అందుకే కాస్త గ్యాప్ ఇస్తున్నాడు. ఈ సారి ఛ‌లో బాలీవుడ్ అంటున్నాడు.
బాలీవుడ్ లో వైర‌స్ అనే సినిమా చేయ‌బోతున్నాడు వ‌ర్మ‌. అదే త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ అంటూ అనౌన్స్ చేసాడు కూడా ఈ ద‌ర్శ‌కుడు. ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా కూడా వ‌ర్మ‌ను న‌మ్మ‌డానికి ఓ నిర్మాత ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ఈ సారి ఆ అవ‌కాశం ప‌రాంగ్ సంగ్వీకి ఇచ్చాడు. ఈయ‌న గ‌తంలోనే వ‌ర్మ‌తో అటాక్స్ 26 బై 11 సినిమా నిర్మించాడు. అప్ప‌ట్నుంచి మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు చేయ‌ని ఈ నిర్మాత‌.. ఇప్పుడు మ‌ళ్లీ వ‌ర్మ‌తోనే జోడీ క‌ట్ట‌బోతున్నాడు. మ‌రి ఈ వైర‌స్ తో బాలీవుడ్ ను వ‌ర్మ ఏం చేయ‌బోతున్నాడో..!

User Comments