కోడిని ప‌ట్టుకుంటున్న రామ్

Last Updated on by

అదేంటి.. రామ్ ఏంటి.. కోడిని ప‌ట్టుకోవ‌డం ఏంటి..? ఏదైనా సినిమా కోసం ప్రాక్టీస్ కానీ చేస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా..? అదేం కాదు కానీ నిజంగానే ఇప్పుడు కోడిని ప‌ట్టుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు రామ్. ఈయ‌న ప్ర‌స్తుతం హ‌లో గురు ప్రేమకోస‌మేలో న‌టిస్తున్నాడు. త్రినాథ‌రావ్ న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ‌గా విశాఖ‌లో జ‌రుగుతుంది. ఇప్ప‌టికే స‌గానికి పైగా షూట్ పూర్తి చేసాడు ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఇక్క‌డే చిన్న స‌మ‌స్య ఉంది. అదే రోజు విశాల్ న‌టిస్తున్న పందెంకోడి 2 కూడా విడుద‌ల కానుంది. అభిమ‌న్యుడు స‌క్సెస్ తో విశాల్ కు తెలుగులో మ‌రోసారి మార్కెట్ భారీగా పెరిగిపోయింది. పైగా తెలుగులో విశాల్ కు గుర్తింపు తీసుకొచ్చిన పందెంకోడికి సీక్వెల్ కావ‌డం.. కీర్తిసురేష్ హీరోయిన్ కావ‌డంతో పందెంకోడి 2పై ఇక్క‌డ కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఒకేసారి ఇద్ద‌రు క్రేజీ హీరోలు వ‌స్తే అది ఇద్ద‌రికీ స‌మ‌స్యే. కానీ ఎవ‌రికి ఎవ‌రూ త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. అన్న‌ట్లు ఇదే సీజ‌న్ లో ఎన్టీఆర్ అర‌వింద స‌మేత‌తో పాటు నాగార్జున‌-నాని దేవ‌దాసు కూడా విడుద‌ల కానున్నాయి. మొత్తానికి.. ఈ వార్ ఎలా ఉండ‌బోతుందో..?

User Comments