రామ్ మ‌రో ద‌ర్శ‌కుడికి ఓకే చెప్పేశాడు

యువ క‌థానాయ‌కుడు రామ్ త్వ‌ర‌లోనే `ఇస్మార్ట్ శంక‌ర్‌`గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటోంది. ఇంత‌లోనే రామ్ మ‌రో ద‌ర్శ‌కుడికి ప‌చ్చ‌జెండా ఊపేశాడు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్‌చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రామ్ అంగీకారం తెలిపిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న‌ట్టు తెలిసింది. `ఇస్మార్ట్ శంక‌ర్‌` పూర్తికాగానే రామ్‌… సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమా కోసమే రంగంలోకి దిగ‌బోతున్నార‌ని తెలిసింది. అదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రంగా రూపొంద‌బోతోంద‌ని స‌మాచారం. ఇటీవ‌ల రామ్ చిత్రాలు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నాయి కానీ.. సాలిడ్ హిట్ అందుకోలేక‌పోతున్నాయి. దాంతో ఆయన మరింత శ్రధ్ధగా, ఆచితూచి క‌థ‌ల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. పూరి తీస్తున్న `ఇస్మార్ట్‌శంక‌ర్‌`పై కూడా రామ్ చాలా ఆశ‌లే పెట్టుకున్న‌ట్టు స‌మాచారం.