చ‌ర‌ణ్ 6 ప్యాక్ సీక్రెట్ లీక్‌

Last Updated on by

`ధ్రువ` సినిమాలో చ‌ర‌ణ్‌ 6ప్యాక్ బాడీని ఆవిష్క‌రించాడు. మెగాప‌వ‌ర్‌స్టార్ లుక్‌పై ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌తో పాటు అభిమానులు, కామ‌న్ జ‌నాలు ఎంతో ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు. చ‌ర‌ణ్ కెరీర్‌లో బెస్ట్ లుక్ ఇదేన‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే అందుకోసం చెర్రీ ఎంతో క‌ఠోరంగా శ్ర‌మించాడు. ప్ర‌త్యేకించి నిర్ధిష్ఠ‌మైన ఆహార నియ‌మాలు పాటిస్తూ, నిరంత‌రం జిమ్ముల్లో క‌ష్టిస్తే ద‌క్కిన రూప‌మ‌ది.

అయితే చ‌ర‌ణ్ మ‌రోసారి ఆ ఫీట్‌ని రిపీట్ చేస్తున్నాడా? అంటే అవున‌నే స‌మాచారం. ప్రఖ్యాత వ్యాయామ శిక్ష‌కుడు రాకేష్ ఉడయార్ పర్యవేక్షణలో జిమ్‌లో మ‌రోసారి తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. ప్ర‌స్తుతం వర్క్ ఔట్ సెష‌న్స్‌లో ఉన్నాడు చ‌ర‌ణ్‌. రాకేష్ ముంబైలో ఫేమ‌స్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్‌. అత‌డిని సల్మాన్ ఖాన్ సలహా మేరకు చ‌ర‌ణ్‌ నియమించుకున్నాడు. ఈ కొత్త మార్పు బోయ‌పాటితో మాస్ యాక్ష‌న్ సినిమా కోస‌మేన‌ని ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. రాకేష్ – చర‌ణ్ జిమ్‌లో శ్ర‌మించేందుకు వెళుతున్న వేళ క్లిక్‌మ‌నిపించిన ఫోటోని ఉపాస‌న స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. అయితే 6 ప్యాక్ తెలుగు హీరోల‌కు కొత్తేమీ కాదు. అంత‌కుమించి చ‌ర‌ణ్ ఇంకేం కొత్త రూపం చూపిస్తాడు? అన్న‌ది వేచి చూడాల్సిందే.

User Comments