ఛాలెంజ్ 2 లో చెర్రీ

Last Updated on by

సామాజిక మాధ్య‌మాల పుణ్య‌మా.. అని ఫిట్‌నెస్‌పై విస్త్ర‌త ప్ర‌చారం సాగుతోంది. ఆరోగ్యంగా ఉంట‌నే భార‌త‌దేశం ప‌రుగులు పెడుతుంద‌ని సెల‌బ్రిటీలు ఎంతో ఉత్సాహంగా ఫిట్‌నెస్ గురించి ప్ర‌చారం చేస్తున్నారు. మ‌న హీరోలంతా ఒక‌రితో ఒక‌రు స‌వాళ్లు విసురుకుంటూ ట్వీట్ సంద‌డి చేస్తున్నారు. ఈ స‌వాళ్ల తంతులో మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్‌లాల్‌, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి టాప్ హీరోలు ఉన్నారు. ఇటీవ‌లే మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ మ‌న తార‌క్‌కి ఫిట్‌నెస్ స‌వాల్ విసిరారు. దానిని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాన‌ని ఎన్టీఆర్ అన్నారు. అటుపై ఎన్టీఆర్ త‌న స్నేహితుడైన చ‌ర‌ణ్‌కి ఛాలెంజ్ చేశాడు.

దానిని చ‌ర‌ణ్ ఒడిసిప‌ట్టుకుని … అట్నుంచి అటే మెగాస్టార్ చిరంజీవి వైపు స‌వాల్ విసిరారు. “తార‌క్ నీ ఛాలెంజ్‌ని అంగీక‌రించాను బ్రో. నేను ఆర్య సుక్కూకి, కేటీఆర్ (టీఆర్ఎస్‌)కి ఛాలెంజ్ చేస్తున్నా. సందీప్‌ కోశ్లా, శోభనా కామినేని, వరుణ్‌తేజ్‌, మన మెగాస్టార్‌కు ఈ ఛాలెంజ్‌ విసురుతున్నాన‌ని తెలిపారు. మొత్తానికి తండ్రికి చ‌ర‌ణ్ విసిరిన స‌వాల్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అన్న‌ట్టు.. `ఛాలెంజ్ 2`లో చెర్రీ ఎప్పుడు న‌టిస్తాడో?

User Comments