మ‌హేష్ న‌ట‌న‌ ప‌వ‌ర్‌ఫుల్!- రామ్‌చ‌ర‌ణ్

Last Updated on by

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` చిత్రానికి సెల‌బ్రిటీ ప్ర‌పంచం నుంచి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో మ‌హేష్ పెర్ఫామెన్స్‌కి ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. కొర‌టాల శివ ప‌నిత‌నాన్ని ప‌దిమంది ప్ర‌త్యేకంగా ప్ర‌శంసిస్తున్నారు. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి నుంచి తొలి ట్వీట్ వ‌చ్చింది. అటుపై వంశీ పైడిప‌ల్లి, అనీల్ రావిపూడి, రామ్ ఆచంట‌, ర‌వి.కె.చంద్ర‌న్‌, ఎన్టీఆర్ .. ఇలా వ‌రుస‌గా టాప్ సెల‌బ్రిటీలంతా ట్వీట్ల వ‌ర్షం కురిపించారు. అందులో ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిశాయి.
ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ వంతు. చ‌ర‌ణ్ లేటెస్టుగా భ‌ర‌త్ షో వీక్షించిన అనంత‌రం త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశాడు. క్లాసిక్ సినిమాకి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ప్రిన్స్ మ‌హేష్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ గా పెర్ఫామ్ చేశారు. శివ అత్యంత‌ అందంగా రాసుకుని, అద్భుతంగా తెర‌కెక్కించాడు. దేవీ సూప‌ర్భ్‌. అత‌డి సంగీతం, ఆర్‌.ఆర్ బాగా ఎంజాయ్ చేశాను. కియ‌రా ఆరంభం అదిరింది. దాన‌య్య గారికి, భ‌ర‌త్ టీమ్‌కి నా శుభాకాంక్ష‌లు“ అని అన్నారు.

User Comments